KANAKA ✍️

Comedy Romance Inspirational

4  

KANAKA ✍️

Comedy Romance Inspirational

గోరింటాకు పూసింది ( కథ)

గోరింటాకు పూసింది ( కథ)

4 mins
329


గోరింటాకు పూసింది (కథ)


"ఎన్నిసార్లు పిలిచినా పలకవు ఏంటి ఎక్కడున్నావ్" అని అరుస్తూ లోపలికి వచ్చాడు రామలింగం...


"మన ఇంద్ర భవనంలో నేను ఎక్కడ ఉంటాను అండి మీరు మరీను ,అంటూ "పెరట్లో నుండి వచ్చింది మీనాక్షి.


 "నీకు తెలుసు కదా నేను వచ్చే సమయానికి నువ్వు గుమ్మం ముందు నాకోసం ఎదురు చూస్తూ ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను"..


 "హా బాగుంది","మీరు ఎప్పుడు వస్తారో నాకేం తెలుసు? అప్పటికి ఆరు గంటల నుండి మీకోసం ఎదురు చూస్తూ అదిగో ఆ అరుగు మీద కూర్చునే ఉన్నాను..


ఇదిగో ఇప్పుడే ,పెరట్లోకి వెళ్లాను గోరింటాకు చెట్టుకు బాగా చిగుర్లు వచ్చి ఆకు బాగా వచ్చింది దాన్ని చూడగానే మనసు పడింది ..


గోరింటాకు కోసి , రుబ్బుకుని పెట్టుకోవాలని అనిపించింది .అందుకే ,అటు వెళ్లాను ఈలోపే కొంపలు అంటకపోయేలాగా గావు కేకలు...


అది కాదే బంగారం," ఉదయం ఆఫీస్ కి వెళ్లి కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే ఎదురుగా నువ్వు స్వాగతం పలుకుతూ ఎదురు వస్తే ఉదయం నుండి పడిన అలసటంత మాయమైపోయి శరీరాలసట తీరిపోతుంది" 


అది నా బలహీనత అయిపోయింది అందుకే నా కోసం ఎదురు ఉండు అంటాను ...


నువ్వు గుమ్మంలో కనిపించకపోతే ఇంకా భారం ఏదో మిగిలినట్లు ఉంటుంది రా అన్నాడు పెళ్ళాం గేడ్డం పట్టుకుని బుజ్జగిస్తూ..


సరే ,సరే వెళ్ళి స్నానం చేసి రండి మీకోసం వేడివేడి గారెలు వేసి అల్లం చట్నీ చేసి ఉంచాను ఒక పట్టు పడదాం అన్నది నవ్వుతూ ...


ఈ లోపు నేను గోరింటాకు కోసి రుబ్బుకొని వస్తాను అంటూ పెరట్లోకి వెళ్ళింది మీనాక్షి ..


ఈ రాత్రికి నాకు పరీక్ష ఉందా ? దేవుడా గోరింటాకు బాగా పండేలా చూడు తండ్రి...


నాప్రేమకి ఈ గోరింటాకు టెస్టింగ్ కిట్ ఏమిటో 

నెలకి ఒకసారి నా దుంప తెంపుతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు..


మీనాక్షికి గోరింటాకు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు బామ్మ గోరింటాకు పెడుతూ, "గోరింటాకు నీ చేతికి బాగా పండితే నీ మొగుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని అర్థం "...


"అదే కొంచెం గవరగా పండితే నీ మీద ప్రేమ తగ్గుతుందని అర్థం." .


అప్పుడు, నీవు నీ మొగుడితో ప్రేమగా ఉంటే అతని ప్రేమ నీకే సొంతం తెలుసా అని చెప్పింది...


మీనాక్షి వయసుతోపాటు మనసులో ఆ మాట పెరిగి పెద్దదయింది ..


పెళ్లయిన దగ్గర నుండి నెలలో మొదటి వారం గోరింటాకు పెట్టుకొని మొగుడికి ప్రేమ పరీక్ష పెడుతుంది...


రామలింగం ముద్దుగా గోరింటాకునీ" ప్రేమకు టెస్టింగ్ కిట్" అనే పేరు పెట్టుకున్నాడు..


 అదృష్టం బాగుండి ప్రతిసారి గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది ...


ఆ టెస్ట్ రోజు అది పాస్ అయ్యే వరకు రామలింగంకి నిద్ర పట్టదు ఈరోజు రాత్రి పరీక్షా సమయం..


ఎందుకో మనసులో భయంగా ఉంది.. గోరింటాకు సరిగ్గా పండగ పోతే ప్రేమ లేదని గొడవపడుతుంది..


"దేవుడా ప్రతినెలా ఈ పరీక్ష ఏమిటి స్వామి ఇన్ని పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు".

 నెలకోసారి బీపీ పెరిగిపోతుంది బాగా పండేలా చూడు తండ్రి ..


అలాగే రేపు కూడా నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ,ముద్ద కర్పూరం హారతి ఇస్తాను తండ్రి అని కోటి దండాలు పెట్టుకున్నాడు...


 వేడివేడి గారెలు అల్లం చట్నీతో, ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి భర్త ముందు పెట్టింది..


 వాటిని తింటూ అమృతం లాగా ఉందే బంగారం. 


మీ చేతిలో ఏదో మాయ ఉంది అని రెండు చేతులు దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు..


ఇంకో మూడు గంటలు ఆగండి మీ ప్రేమ కూడా తెలుస్తుంది.

నామీద ప్రేమ నిజమో కాదో తేలిపోతుంది ఇలా ముద్దులతో కాదు అన్నది చేతినీ వదిలించుకుని ..


ఏమిటో నా ప్రేమకు నీ గోరింటాకు పరీక్ష అనుకుంటూ చేతులు కడుక్కోవడానికి వంట గదిలో సింక్ దగ్గరికి వెళ్ళాడు ..


పక్కనే ఉన్న గోరింటాకు గిన్నె చూసి,ఒక్కసారిగా గుండెల్లో దడ ,గుబులు పుట్టుకొచ్చాయి...

 

వెంటనే దాన్ని ముందుకు వెళ్లి గిన్నెకి నమస్కారం పెట్టి," ఈ పరీక్షలో నేను నెగ్గేలా చూడు " 


"నీ చెట్టుకు ఎండ తగలకుండా తాటాకు పందిరి వేయిస్తాను "..


"రోజు టాటా మినరల్ వాటర్ కొనుకొచ్చి పోస్తాను" 


అంటూ తలవంచి నమస్కారం పెట్టాడు.. 


అప్పుడే వంటగది లోకి వచ్చిన మీనాక్షి భర్తను చూసి ఏంటండీ దేవుడు ఫోటో లేదు కదా దేనికి నమస్కారం పెడుతున్నారు అన్నది ..


భార్య మాటకి తడబడుతూ ఏమీ లేదు బంగారం. ప్రకృతి ,ప్రకృతికి నమస్కారం పెట్టి పడుకుందామని అన్నాడు..


 వంటగదిలో ప్రకృతి ఏముంది అన్నది చుట్టూ చూస్తూ ...


"అదే ,అదే అమృతం లాంటి నీ చేతి వంట అందిస్తున్న ఈ గ్యాస్ స్టవ్ కి నమస్కారం పెడుతున్న" అని తడబడుతూ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు ...


"ఏమిటో ఈ మనిషి రోజు బాగానే ఉంటాడు నేను గోరింటాకు పెట్టుకునే రోజు మాత్రం ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అయ్యో రామ!" అనుకుంటూ వంటగది సర్దేసి గోరింటాకు గిన్నె తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది..


గోరింటాకు గిన్నెతో వస్తున్న భార్య ఎగ్జామ్స్ సెంటర్ కి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వస్తున్నా ఇన్విజిలేటర్ లా కనిపించింది...


గోరింటాకు బాగా పండక పోతే ఆ నెల అంతా నా మీద ప్రేమ లేదని రచ్చ చేసే పెళ్ళాం మాటలు గుర్తొచ్చి దేవుడా ,దేవుడా అంటూ ముసుగు వేసి పడుకున్నాడు...


 కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకుని అలాగే నిద్రపోయింది మీనాక్షి...


ఉదయం 5 గంటలకే నిద్రలేచి ముసుకు తీసి అటు ఇటు చూసాడు రామలింగం ..


పక్కన మీనాక్షి గోరింటాకు పెట్టుకొని , స్పృహ లేకుండా నిద్రపోతుంది...


పిల్లి లాగా మంచం దిగి , మీనాక్షి పడుకున్న వైపు వచ్చి, మంచం పక్కన కింద కూర్చుని మీనాక్షి కాళ్లకున్న గోరింటాకు తీసి చూశాడు...


"ఒక్కసారి ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి". 


సింధూరంలాగా పండిన గోరింటాకు తన ప్రేమకు సాక్షంలో కనిపించింది ..


"నేను టెస్ట్ పాస్ అయ్యాను అని గట్టిగా అరిచాడు".


భర్త అరుపుకి కళ్ళు తెరిచి చూసి ఏమైంది అంటూ పైకి లేచింది మీనాక్షి ..


ఈ నెల కూడా నేను డిస్టెన్షన్లో పాస్ అయ్యానోయి అన్నాడు రామలింగం సంతోషంగా...


వెంటనే భర్తను దగ్గరికి తీసుకొని, నుదుటి మీద ముద్దు పెట్టింది.రామలింగం ఆనందానికి అవధులు లేవు..


ఉదయం పనికి వచ్చిన రత్తాలు , మీనాక్షి చేతులకి,కాళ్ళకు ఎర్రగా పండిన గోరింటాకు చూసి...


"అమ్మాయిగారు మీరు ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్న ఇంత ఎర్రగా పండుతుంది ఎలా? 

 నాకు మాత్రం ఏ రోజు పండదు ఆ సీక్రెట్ ఏమిటో నాకు చెప్పండమ్మా అన్నది ఇల్లు చిమ్ముతూ,...


" ఏముంది మా ఆయన కి నా మీద ఉన్న ప్రేమ అది అంతా అన్నది ముద్దుగా" ..


అంటే," మా ఆయనకి నా మీద ప్రేమ లేదా,"? అన్నది ఊడుస్తున్న చీపురు పక్కన పెట్టి...


అలా కాదే ,నువ్వు కూడా మీ ఆయన ప్రేమని గెలిపించాలి, నేను గెలిపిస్తున్నట్లు" అన్నది నవ్వుతూ..


అర్థం కాలేదమ్మా అన్నది ఆశ్చర్యంగా రత్తాలు. 


"ఈసారి నువ్వు గోరింటాకు పెట్టుకునేటప్పుడు ...

"కొంచెం పులుపుతో పాటు,

 కొంచం ప్రేమ కూడా కలుపు", ..


అప్పుడు మీ ఆయన కూడా పరీక్ష పాస్ అవుతాడు" అన్నది వంట చేయడానికి కూరగాయలు తరుగుతూ...


గోడ పక్క నుండి వారి మాటలు విన్న రామలింగం, భార్య ప్రేమకు మురిసిపోతూ 


"నేను గోరింటాకు ప్రేమ టెస్టింగ్ కిట్ పాస్ అవుతున్న అనుకున్నా కానీ ,నువ్వు పాస్ చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను రా బంగారం "..


భార్యకి తన మీద ఉన్న ప్రేమకి మురిసిపోతూ వెంటనే భార్య దగ్గరికి వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాడు....


"భార్య ప్రేమ పొందడం భర్త అదృష్టం".

 "భర్త ప్రేమ పొందడం భార్య సౌభాగ్యం"...


రచన 

k.kanakadurga 

Guntur .



Rate this content
Log in

Similar telugu story from Comedy