Dinakar Reddy

Abstract Drama

3.2  

Dinakar Reddy

Abstract Drama

ధనం - దానం

ధనం - దానం

2 mins
404


లీలా! ఇలాగేనా పెద్ద వాళ్ళతో మాట్లాడేది? అమ్మ కోప్పడుతున్నా లీలకు తను చేసింది తప్పు అనిపించలేదు.


పాఠం చెప్పే మాష్టారుని నలుగురిలో హేళనగా మాట్లాడి వచ్చింది లీల. విషయం తెలిసి వాళ్ళ అమ్మగారు కోప్పడినా తను పెద్దగా పట్టించుకోలేదు. అవసరమైతే డబ్బులిచ్చి ఆ మాష్టారు మళ్లీ కంప్లయింట్ ఇవ్వకుండా చేయొచ్చనే ఆలోచన ఆమెది.


డబ్బుతో ఏదైనా కొనగలం అనీ, తమ కన్నా ఆర్థికంగా క్రింది స్థాయిలో ఉన్న వారిని గౌరవించాల్సిన అవసరం లేదు అని అనుకునేది లీల.


స్నేహితులతో కలిసి వేరే ఊరు వెళ్లి అక్కడ నుంచి కారులో బయల్దేరింది. కారు మధ్యలో ఆగిపోవడంతో డ్రైవర్ కి చెప్పేసి ఇక తప్పక బస్సు ఎక్కింది. బస్సు దిగాక చూసుకుంటే తన పర్సు కనిపించలేదు. ఎక్కడో పడిపోయినట్లుంది. మళ్లీ ఇంకో బస్సు ఎక్కితే గానీ తను ఇంటికి చేరలేదు.


ఇంటికి ఫోన్ చేద్దామన్నా చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎవరినైనా అడుగుదాం అంటే అభిమానం అడ్డొచ్చింది. మధ్యాహ్నం వేళ కావడంతో నడుస్తుంటే నీరసం పెరిగింది.


ఓ గుడి దగ్గర అన్నదానం చేస్తుంటే అక్కడ క్యూ లో నిలబడి భోజనం పెట్టించుకుని తింది. హోటల్ కి వెళ్లి ఎంత ఖర్చు పెట్టినా దొరకని సంతృప్తి ఆ గుడిలో తిన్న భోజనంతో ఆమెకు దొరికింది.


తన చుట్టూ చూసింది. ఎవరూ ఎక్కువా కాదు. ఎవరూ తక్కువా కాదు. ఎంత భ్రమపడింది తను. ప్రతి విషయంలోనూ ఎలా అవతలి వాళ్ళను తక్కువగా చూడాలా అని ఆలోచించేది.. ఇప్పుడు ఏమైంది.. పర్సు పోగానే తను ఇలా అయిపోయింది.. డబ్బు ఒక్కటే చాలు.. ఎలా అయినా బ్రతికేస్తాను అనుకునే తను ఇలా ఉచితంగా పెట్టే భోజనం వెతుక్కుంటూ వచ్చింది.


ఆనందంగా బ్రతకడానికి డబ్బు ఒక్కటే చాలదు. కాస్త ఓర్పు, అవతలి వ్యక్తులను అర్థం చేసుకునే గుణం ఇంకా ఎలాంటి పరిస్థితిలో అయినా ధైర్యంగా ఉండే లక్షణం కావాలి .. లీల మనసులో అనుకుంది.


లీల భోజనం చేసి అక్కడే బయట ఉన్న కొట్లోంచి ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ చేసుకునేందుకు డబ్బులు లేవని ముందే చెప్పినా ఆ కొట్లో ఉన్న పెద్దావిడ ఏమీ అనలేదు.


వాళ్ళమ్మ వేరే కారులో వచ్చి లీలను ఇంటికి తీసుకుని వెళ్ళింది.


మరుసటి రోజు కాలేజీకి తొందరగా వెళుతోంది లీల.. బహుశా మాష్టారుని క్షమించమని అడగడానికి కాబోలు..



Rate this content
Log in

Similar telugu story from Abstract