చంద్రకళ
చంద్రకళ


తరగతి గంట మోగింది. మేడమ్ తరగతి లోకి వచ్చింది. పిల్లలందరూ శుభోదయం చెప్పి కూర్చున్నారు. అప్పుడు మేడమ్,"ఏంటర్రా! హోంవర్క్ చేసారా? " అని అడిగింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. "కనీసం ఏం హోంవర్క్ ఇచ్చానోన్న గుర్తుందా? " అని అడిగింది మేడమ్. మళ్ళీ నిశ్శబ్దం. అప్పుడు మేడమ్ ఒకర్ని లేపి, "నిన్న ఏం హోంవర్క్ ఇచ్చారా?" అని అడిగింది. అప్పుడు వాడు - "ఈ ప్రపంచంలో అత్యంత ధైర్యవంతులు ఎవరు? ఎందుకు? - ఆ ప్రశ్న కి, జవాబు రాసుకురమ్మన్నారు, మేడమ్," అని చెప్పాడు. "మరి రాసుకొచ్చావా?" అని అడిగింది. "ఆ.. " అంటూ, తలూపాడు. "మరి జవాబు చెప్పురా!" అంది మేడమ్. అప్పుడు వాడు, "అమ్మ - ఎందుకంటే, తనతోపాటు తన కుటుంబాన్ని చూసుకుంటూ, ఇంట్లోపనులలో - బయటపనులలో సమతుల్యత పాటిస్తూ, జీవితంలో ఏ కష్టం వచ్చినా గుండెధైర్యంతో వాళ్ళు ఎదుర్కొంటారు, మేడమ్", అని చెప్పాడు. మేడమ్ ఇంకొకర్ని లేపి అడిగింది, వాడు - " నాన్న - ఎందుకంటే, వీళ్ళు బయట ఎన్నీ కష్టాలైన పడని, బాధలు పడని, వాటిని గుండెళ్ళో దాచుకుంటారు, ఇంట్లోకి నవ్వుతూనే వస్తారు, పిల్లలను నవ్విస్తూనే ఉంటారు మేడమ్ ", అని చెప్పాడు. మేడమ్ అలా ఒకరి తర్వాత ఇంకొకర్ని లేపుతుంది. అందులో ఒకరు, "ఒక అనాథ - ఎందుకంటే, అందరికి ఎవరొకరు తోడైన ఉంటారు, కాని ఇతనికి తోడు - నీడ అంటూ ఏది ఉండదు. తనంతకు తానే పెరిగి, ప్రయోజకుడు అవ్వాలి. ఇంతకంటే ధైర్యంగా పరిస్థితిలను ఎవరు ఎదుర్కొంటారు మేడమ్", అని చెప్పాడు. అలా ఒకరి తర్వాత ఒకరు, స్వాతంత్ర్య సమరయోధులని, దేశ సరిహద్దులలో వారి ప్రాణాలని పణంగా పెట్టి మరి మనల్ని కాపాడుతున్న పౌరులని,..ఇలా అందరూ చెప్పుకొచ్చారు. ఇంక తరగతిలో ఒక్కడే మిగిలున్నాడు. వాడే రాము. మేడమ్ రాముని లేపి అడిగింది. అప్పుడు రాము సమధానంగా, " ఈ ప్రపంచంలో అత్యంత ధైర్యవంతంగా ఉంది, చంద్రకళ ఆంటీ మేడమ్" అని చెప్పాడు. "ఎవర్రా, ఈ చంద్రకళ ఆంటీ" అని అడిగింది మేడమ్. అప్పుడు రాము, " ఈరోజు ప్రొద్దున నాన్నతో పాఠశాలకి వస్తూంటే, రోడ్డు మధ్యలో నాన్న బండి ఆపి, చప్పట్లు కొట్టి, డబ్బులు అడిగింది, ఆమె పేరు ఏంటి అని అడిగా, చంద్రకళ అని చెప్పింది, ఆమె మేడమ్ " అని అన్నాడు. పిల్లలు అందరూ నవ్వారు. మేడమ్ అందర్ని ఆపి, " రాము, ఆమె ధైర్యవంతురాలని ఎందుకు అనుకుంటున్నావో, చెప్పు" అంది. అప్పుడు రాము ఇలా అన్నాడు - " ఒక అమ్మగాని, ఒక నాన్న గాని, ఒక యోదుడు గాని, ఒక పౌరుడు గాని, ఆకరికి ఒక అనాథ అయిన గాని వారికి, ఒక కొడుకో/కూతూరో, స్నేహితుడో/స
్నేహితురాలో, తరువాత ఒక భర్తో/భార్యో, దాని తరువాత తండ్రి/తల్లి, అత్త/మామ, పిన్ని/బాబై, పెద్దమ్మ/పెద్దనాన్న, దాని తరువాత తాత/అవ్వ, ఇవ్వని కాకపోయిన కనీసం దారిలో వెళ్ళే పిల్లలు ఒక ఆంటీనో/అంకులో ఇలా ఏదో ఒక్క బంధంతో నైన ఎవరొకరు పిలుస్తారు. ఏదో ఒక్క బంధైన వారితో ముడిపడే ఉంటుంది. ఏ కష్టమొచ్చిన ఏదో ఒక్క బంధైన వారికి తోడుగానే ఉంటుంది. తోడుగా ఉండుకపోయిన, ఆ బంధం నుంచి ఎవరు వారిని వేరు చెయ్యరు. కాని చంద్రకళ లాంటి ఆంటీ వాళ్ళకి అలా కాదు. వారు ఒక్కసారి చంద్రకళ లా మారారంటే, ఏ బంధైన వారిని వదిలేస్తుంది. వారికి ఈ సమాజంలో వారి ఒంటరితనం తప్ప ఎవ్వరూ తోడుగా ఉండరు. సమాజంలో ఏదో వెలివేసినట్టు వారిని చూస్తారు. ఆకరికి మేడమ్, మిగతా వాళ్ళందరూ ఏ పరువు - మర్యాదల కోసం పనులు చేస్తుంటారో, వీళ్లకు ఆ పరువు - మర్యాదలను ఈ సమాజం దగ్గరికి కూడా రానియ్యదు. వాళ్ళళో వాళ్ళే బాధపడుతూ, తన తోటి వాళ్ళు బాధపడకూడదని బయటికి నవ్వుతూ, వాళ్ళళో వాళ్ళే ఒక చిన్న ఇంటిని నిర్మించుకున్నారు మేడమ్. రెండు - మూడు, పెద్ద - పెద్ద కష్టాలకే ఏడ్చి, ఈ ప్రపంచాన్ని వదిలేస్తే బాగుంటుంది అని ఆలోచించే మనం ఎక్కడ, అన్నీ పెద్ద - పెద్ద కష్టాలు వచ్చినా, ఇలా ఎందుకు మనకే జరుగుతుందని ఆలోచించకుండా, సమాజాన్ని ఎదిరిస్తూ, జీవితంలో ముందుకు పోతూ ఉండే వీళ్లేక్కడ, వీళ్ళళో కొంతమందైతే ఎన్నో సాధించారు కూడా మేడమ్, కాని అవి ఎవ్వరూ పట్టించుకోరు. అయిన గాని వాళ్ళు ఓటమి ఎరుగరు. ఇంతటి గుండెధైర్యం ఉన్న వాళ్ళని మనం ఎక్కడ చూసాం, మేడమ్. గొప్పగొప్ప వాళ్ళని జీవితంలో ఉదాహరణంగా తీసుకునే మనం, వీళ్ళని ఎందుకు తీసికోవట్లేదు. ఏమో మేడమ్ మరి! , కాని నాకు కష్టం వచ్చినప్పుడు చంద్రకళ లాంటి ఆంటీ వాళ్ళని తలుచుకుంటే చాలు, ఏ కష్టమైన కష్టంలా కనిపించదు, అని అనిపిస్తుంది, నాకు. అందుకే ఈ ప్రపంచంలో చంద్రకళ లాంటి ఆంటీ వాళ్ళు అత్యంత ధైర్యవంతులని నేను నమ్ముతున్న మేడమ్." - అని చెప్పాడు. తరగతి మొత్తం నిశబ్దం. ఒక్కరు ఒక్కమాట మాట్లాడలేదు. ఇంత గొప్ప కొడుకుని కన్నందుకు, ఆ మేడమ్ ఆనందంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది.
- కృష్ణ