Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

బుజ్జి పిచ్చుక

బుజ్జి పిచ్చుక

1 min
307


ఇంకొంచెం సేపు ఉందాం.నేను గెడ్డం కింద చేతులు పెట్టుకుని మిద్దె వైపు చూస్తూ ఉన్నాను.

మౌనీ! పద నాన్నా..బయట చూడు సామాన్లు పెట్టుకుని మన కోసమే అందరూ నిలబడి ఉన్నారు అంది అమ్మ.


రోజూ వచ్చేసేది. నా బుజ్జి పిచ్చుక నాలుగు రోజుల నుండీ రావట్లేదు. ఇల్లు మారిపోతున్నాం. ఈ సంగతి దానికి ఎలా తెలుస్తుంది. అందుకే చెప్పి వెళదాం అని నేను ఎదురు చూస్తున్నా..


రోజూ పొద్దున్నే గింజలు వేస్తే చటుక్కున తినేసి నా ఫ్రాక్ మీద ఎక్కి చుట్టూ తిరుగుతూ ఆడుకునేది.


నీళ్ళ గిన్నెలో పొర్లుతూ కాసేపు ఆడుకుని నీళ్ళు తాగేసి వెళ్ళిపోయేది. 


మౌనీ! రామ్మా అని అమ్మ కారులో కూర్చుని పిలిచింది. 


నేను వెళ్లి కారులో కూర్చున్నాను. నా బుజ్జి పిచ్చుక మా కొత్త ఇంటికి దారి కనుక్కుంటే బావుణ్ణు అనుకుని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract