broken angel Keerthi

Drama Tragedy Others

4.5  

broken angel Keerthi

Drama Tragedy Others

అమృత సాగరం పార్ట్ 3

అమృత సాగరం పార్ట్ 3

4 mins
305



ఒక నిమిషం వరకు మౌనం గా నే వున్నారు... ఆ అబ్బాయి కాస్త గొంతు సవరించుకున్నాడు...మాట్లాడటానికి సిద్ధం అవుతున్నాడు అని అన్నట్లు గా....వినడానికి నేను సిద్ధమే అని అన్నట్లు నేల చూపులు మాని తన వంక చూసింది...అబ్బాయి చూడటానికి రంగు ఎత్తు బాగానే ఉన్నాడు...కానీ మనసు ఎలాంటిది అని ఆలోచిస్తుంది అమృతా....


నీ గురించి అంతా చెప్పారు....నాకు నువ్వు ఒకే ...నీ ఇష్టం ఏమిటి అని నువ్వు చెపితే మనం ముందుకు వెళ్ళవచ్చు...నేను నచ్చుతా అనుకో...అని చిన్న నవ్వు...


ఆ నవ్వు ....తనతో మాట్లాడిన పద్దతి అమృత కి నచ్చలేదు.. హొ అవునా...సరే వెళ్దాం అని తన వంక కూడా చూడకుండా ముందుకు కదిలింది ..తను అలా వెళ్ళడం పెళ్లి కొడుకు కి నచ్చలేదు ... వెళ్ళాకా ఫోన్ చేసి చెప్తాం అని వెళ్ళిన వారు...నచ్చలేదు అని చెప్పేశారు...


అమ్మ వాళ్ళు బాధ పడుతూ చెప్పిన అమృత కి మాత్రం పెళ్లి మిస్స్ అయినందుకు ఆనందంగా ఉంది..


📲📲📲📲📲


హాల్లో....


హాయ్ ... అమ్ము...నేను కీర్తి నీ ....రేపు నా పెళ్లి తప్పకుండా రావాలి...


ఎంటి రేపు పెళ్లి అయితే ఇప్పుడా చెప్పేది...


ఎం అనుకోకే....చెప్పాను అని అనుకున్న...మంచి రోజులు అని త్వరగా ఫిక్స్ చేసారు...హడావుడి లో చెప్పలేదు...


సరేలే...వస్తాను... అడ్రెస్స్ పంపు.


సరే....తప్పకుండా రా....


సరెనే ....

🌅🌅🌅🌅🌅🌇🌇🌇🌇🌇🌅🌅🌅🌅🌅🌇🌇

..పెళ్లికి డెకరేషన్ అదిరిపోయింది ...ముందు ఎదురుగా రంగులతో కూడిన బెలూన్లు అందం గా సర్ధి పెట్టారు...వచ్చే వారికి అందరికీ ఎంట్రన్స్ లో గిఫ్ట్స్ ఇస్తున్నారు....ఇంకా కొంచం లోపలికి వెళ్ళగానే...పిల్లల కోసం షించన్, డోరేమొన్, నోబిత ల రూపాలు వున్న డ్రేసింగ్ తో వున్న మనుషులు వచ్చి పోయే వాళ్ళకి హాయ్ లు చెప్తున్నారు....

ఎవరో వెనుక నుంచి వచ్చి అమృత కనులు మూసారు....

ఎవరు అంటూ చెయ్యి ముందుకు లాగడానికి ప్రయత్నం చేసింది ....అయిన వదలలేదు....

చెయ్యి తాకి చూసింది...చాలా తెలిసిన స్పర్శ....ఎవరా అని ఆలోచించి...

అక్షర......అని అంటుంది...

చేతులు విప్పి....అమృత ముందు కి వచ్చి ...ఎలా గుర్తు పట్టవు నేనే అని....అంటూ హగ్ చేసుకుంది అక్షర...


హా... ఎం లే...నువ్వు ఎలానో స్నానం చెయ్యవు గా ....నా ఫ్రెండ్స్ లో అలాంటి అలవాటు నికు మాత్రమే వుంది అందుకే సులువుగా గుర్తు పట్టా...


ఎంటే...నేను స్నానం చెయ్యనా... రాక్షసి...అంటూ అమృత చెవి మెలి పెడుతుంది...


అబ్బ వదులే...నొప్పి పెడుతుంది...మరి నన్ను అంటావా...


ఆ...అంటాను...


ఇంకా గట్టిగా మెలి వేస్తుంది...అక్షర...


లేదు లేదు అననే ... వదిలెయ్యి ....అని అంటుంది 


హా...అల రా దారికి...కానీ ఏ మాట కి ఆ మాటే చెప్పాలి...నువ్వు అప్పటి కంటే ఇప్పుడు చాలా అందం గా వున్నావే ...ఎం చేస్తున్నావ్ కాస్త సలహా ఇవ్వవచ్చు కదా...


చాలు లే వే తల్లి...నన్ను తెగ మెట్లు ఎక్కించకు... పడిపోతాను....అవును మన ఫ్రెండ్స్ అందరు వచ్చారా...


హా...నీకోసమే వెయిటింగ్...పదా అని లాగుతూ తీసుకొని వెళ్ళింది.....


అమృత నీ చూడగానే అందరికీ చాలా సంతోషం గా అనిపించింది....ఎప్పుడు రెడీ కానీ అమృత రెడీ అయ్యి వుండడం చూసి ....అమృత ఎంత మారి పోయావు...చాలా అందం గా వున్నావు ఇప్పుడు...అని స్నేహితులు అంటారు ...


అంటే ఇన్ని రోజులూ బాలేనా ..


అలా కాదే ..ఇప్పుడు ఇంకా బాగున్నావు అని...


సరే లే...ఎలా ఉంది మారేడ్ లైఫ్ అని కొత్తగా పెళ్లి చేసుకున్న నందిని వంక చూస్తూ అడిగింది అమృత...


ఎం వుందే పుట్టింట్లో గారాబం చేస్తూ..పెరిగి ...అత్తారింట్లో అడుగు పెట్టిన మనకు అన్ని వింత గానే అనిపిస్తాయి ..మన ఇంటికి ఏ బంధువులు వచ్చిన వాళ్ల ముందు దర్జాగా కూర్చొనే వాళ్ళం....

అత్తారింట్లో వచ్చిన వాళ్లకు మర్యాదలు ఇస్తు...నిల్చుంటం...

టీవీ లో నచ్చిన ప్రోగ్రాం నచ్చిన సౌండ్ పెట్టుకొని చూస్తాం...అత్తారింట్లో ఆ ఫ్రీ నెస్ వుండదు...వాళ్ళు ఎది పెడితే అదే చూస్తాం...బెట్టు చెయ్యము...

పుట్టింట్లో నచ్చని కూరా అస్సలు ముట్టం...అత్తారింట్లో నచ్చక పోయిన సరే మనమే వండి మనమే తింటం...

పొద్దున పది అయిన లేవని మనం..అత్తారింట్లో అయిదు గంటలకే లేస్తము..అలారం పెట్టుకొని మరీ....

అందరికీ ఎం కావాలో అడిగి మరీ చెయ్యడం....అలాంటి కొత్త అలవాట్లు అన్ని నేర్చుకుంటాం...

అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న జలుబు వున్న మంచం మీద నుండి దిగము...

అదే అత్తారింట్లో వుంటే ఎంత జ్వరం వున్న...మనలో లేని శక్తి నీ కూడా తెచ్చుకొని మరి పనులు చేస్తాము....

అమ్మ చిన్న మాట అన్న ఎదురు తిరిగే మనం....అత్తయ ఎన్ని మాటలు అన్న మౌనం గా బరిస్తం.....అని హ్మ్మ్...అని నిట్టూర్పు విడిచింది...


అబ్బో..పెళ్లి అయ్యి నెల రోజులు కూడా కాలేదు ఇప్పుడే ఇంత పెద్ద చిట్టా విప్పావు ఎంటే...


ఎప్పుడు అయ్యింది అని కాదు అమ్మ...అయ్యిందా లేదా...హా..అని పవర్ స్టార్ డైలాగ్ కొట్టింది..నందిని...


మిగితా స్నేహితులు అంతా నవ్వారు...నందిని డైలాగ్ విని,...


అవునే మధు నీ పెళ్లి చూపులు ఎం అయ్యాయి....


హా...సవంత్సరం నుంచి కొన సాగుతున్నాయి...అందరి ముందు దిష్టి బొమ్మ ల రెడీ అయ్యి కూర్చోవడం...వచ్చిన వాళ్ళకి మర్యాదలు చెయ్యడం....మా ఇంట్లో రోజు వారి పనుల్లో భాగంగా మారిపోయింది....వస్తారు చూస్తారు....కొందరు రంగు తక్కువ వుంది....పొట్టిగా వుంది..బక్కగా వుంది అని... రకరకాల వంక లు చెప్పి...నా పై నాకు వున్న ఆత్మ విశ్వాసం పోయ్యేల ఎన్నో అని వెళ్ళిపోతారు....అసలు ముందు ఫోటో చూసినప్పుడే డిసైడ్ అయితే అయిపొద్ధి గా...వచ్చి నన్ను చూసి మాట్లాడి మంచిగా టీ లు,టిఫిన్ లు కానించి తీరిగ్గా జాతర చూడడానికి వచ్చినట్లు చూసి వెళ్ళిపోతారు....అసలు నాకు తెలియక అడుగుతున్న నా రంగు తక్కువని అంటున్నారు ..నన్ను చూడడానికి వచ్చిన వాళ్ల రంగు కూడా తక్కువే...కానీ వాళ్ళకి తెల్లగా వుండే అమ్మాయి కావాలి...వచ్చే అమ్మాయి మాత్రం ఈ కర్రోడిని ఎందుకు చేసుకోవాలి మరి....వాళ్ళని వాళ్ళు ప్రభాస్ అని ఫీల్ అవుతారు కావచ్చు...అందం చూసి పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక అంతే అందంగా వుంటారు అని ఎవరయినా గ్యారంటీ ఇస్తారా మరి..అని కోపం గా అంటుంది...మధు


అబ్బో...లోపల పెద్ద అగ్ని గుండమే వుంది....అని నవ్వుతూ అంటుంది స్నేహ....


అవునే స్నేహ ,..నీ వ్యాపారం సంగతి ఎం అయ్యింది...అని అడిగింది మధు...

అవునే ఎం అయ్యింది...సొంతగా ఒక షాపు పెడతా దానికి బ్రాంచ్ లు తెరుస్త అని కలలు కనే దానివి గా...దానికి పేరు కూడా ఎదో పెట్టావు....గుర్తు రావడం లేదు అని ఆలోచిస్తూ...హా... ఉమెన్స్ వర్ల్డ్...అమ్మాయిలకు కావలసిన అన్ని ఒకే చోట దొరికేలా పిన్నిస్ నుంచి హై క్వాలిటీ బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్ని ఒకే దగ్గర వుండేలా వాళ్లకు కావలసిన అన్ని ఒకే చోట వుండేలా పది షాపులు తిరగకుండా వుండే షాప్ పెడతా అన్నావు...

ఆ మాట వినగానే అప్పటి వరకు నవ్వుతూ వున్న స్నేహ నిశబ్దం అయ్యింది...

స్నేహితులు అంతా తన చుట్టూ చేరారు...

ఏమయ్యిందే అని అంటూ బుజం పై చేతులు వేసి మెల్లిగా..



స్నేహా కి ఎం జరిగింది.... నెక్స్ట్ పార్ట్ లో...


Rate this content
Log in

Similar telugu story from Drama