Dinakar Reddy

Abstract Children Stories Children

4  

Dinakar Reddy

Abstract Children Stories Children

అమ్మ - ఆహారపు అలవాట్లు

అమ్మ - ఆహారపు అలవాట్లు

1 min
320


పొద్దుటే ఆ చిప్స్ ప్యాకెట్ ఎందుకు అంటూ వచ్చింది అమ్మ.


ఇదిగో రెండు ఇడ్లీ తిని ఈ రాగిజావ తాగు.. ఆకలి అనిపిస్తే పదకొండు గంటలకు ఈ పల్లీ ఉండలు రెండు తిను .. 

ఇంట్లో అందరమూ డైట్ పాటించాల్సిందే అంటుంది అమ్మ.


ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ బాక్సు తీసుకెళ్లకుండా మేనేజ్ చేశా.. ఈ సంవత్సరం అమ్మ వింటేనా..


బయట ఫుడ్ తింటే ఆరోగ్యం దెబ్బ తింటుంది అని లంచ్ బాక్సు రెడీ చేస్తోంది.


మధ్యాహ్నానికి ఇదిగో బాక్సు.. వెజిటబుల్ రైస్, కర్డ్ రైస్ విడిగా పెట్టాను అంది అమ్మ.


అప్పుడే అయిపోలేదు. నేను కాలేజీ నుంచి ఇంటికి రాగానే

ఉడకబెట్టిన పెసలు, లేదా వేయించిన అనపగింజలు ఇస్తుంది.


నాన్ వెజ్ తినకుంటే ప్రోటీన్ కోసం నువ్వుల లడ్డు తయారు చేస్తుంది.


రాత్రికి ఒక చపాతీ కొంచెం పెరుగన్నం.. ఇంకా ఆకలి ఉంటే ముందుగానే తెచ్చిన పండ్లు ఉండనే ఉంటాయి..


ఇలా రోజంతా మా ఆరోగ్యం కోసం అమ్మ రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటుంది. 


నేనూ ఒక కండీషన్ పెట్టాను అమ్మకు. అమ్మ కూడా ఇవే ఆహార పదార్థాలు తింటూ, విశ్రాంతి తీసుకుంటాను అంటేనే నేనూ తింటాను అని.


అమ్మ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం కదా..


Rate this content
Log in

Similar telugu story from Abstract