Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

ఆన్లైన్లో ప్రేమ జాడ

ఆన్లైన్లో ప్రేమ జాడ

1 min
414


సినిమా ప్రపంచం అనే ఆన్లైన్ గ్రూప్ చాట్ లో డిస్కషన్ జరుగుతోంది. ఆ యాప్ లో ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్న వివేక్ కొన్ని పాత సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు.


అన్నిటికీ జ్యోత్స్న టక్కున జవాబు ఇస్తోంది. గ్రూప్ చాట్ ముగిసాక వివేక్ జ్యోత్స్న కు మెసేజ్ చేశాడు.


వివేక్ : హాయ్. మీతో మాట్లాడాలి అనిపించింది.


జ్యోత్స్న : దేని గురించి?


వివేక్ : అంటే..


జ్యోత్స్న : అడగండి ఇక. మీరెక్కడ ఉంటారు? స్కూలు, కాలేజీ, ఉద్యోగం..


వివేక్ : అంటే అన్నీ వద్దు కానీ.. కొన్ని చెప్పండి.. నాదైతే శారదా విద్యా మందిర్ స్కూల్ అండీ..


జ్యోత్స్న: కొంప తీసి నువ్వు D సెక్షన్ వివేక్ కాదు కదా..


వివేక్ : (కాస్త సిగ్గుతో) అవునండీ.. మీరు?


జ్యోత్స్న : గుర్తు పట్టు. ఈ పేరు ఒరిజినల్ కాదు కానీ.. నేనూ అదే స్కూల్. A section.. 


వివేక్ ఆ A సెక్షన్ లో అమ్మాయిల పేర్లు ఫేస్బుక్ గ్రూపులో చూసి చెప్తూ ఉన్నాడు.


జ్యోత్స్న కి తెలుసు తన చిన్ననాటి నేస్తం అతనే అని. మనసుకి దగ్గరై, ఇన్నాళ్ళూ మాటలకి దూరమైన అతణ్ణి నేరుగా కలవాలనే ఆమె పేరు చెప్పకుండా ఉంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract