Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

ఆలస్యం.. అమృతం..

ఆలస్యం.. అమృతం..

1 min
383


అబ్బబ్బా.. నా వల్ల కాదు. నేను మా పుట్టింటికెళ్ళిపోతాను. మృదుల చిటపటలాడుతూ పోపు వేయిస్తోంది.


ఏమిటే! ఇప్పుడు నేనేమన్నాను. అసలే నేను ఫెమినిస్ట్ ని. నిన్నేమైనా అనే అభిప్రాయం నాకు లేదు అన్నాడు ఆమె భర్త సృజన్.


నా ఖర్మ. తండ్రి ఫెమినిస్ట్. కూతురు బద్ధకిస్టు. సరిపోయారు.. ఇద్దరూ నాకు. కూతురు సమీర ఏడవ తరగతి పరీక్షల పేపర్ ఇంపోజిషన్ వ్రాయట్లేదని ఆమె కోపం.


అయినా కూతురి మీద అలిగి ఎవరైనా పుట్టింటికి వెళతాం అంటారా.. సృజన్ అనునయిస్తూ అన్నాడు.


ఎవ్వరూ అనలేదేమో నేనంటాను. మొన్నటికి మొన్న బంధువులు ఉన్నట్టుండి వచ్చారు కాస్త కాఫీ పొడి తెచ్చిపెట్టవే అంటే.. బాలకార్మిక వ్యవస్థ అంతమవ్వాలి అంటూ స్లోగన్ ఇచ్చి నిద్రపోయింది..


నిన్నటికి నిన్న నేను గుడికి వెళతాను .. పొద్దుటే పాలు పోయించుకోవే అంటే.. దీనికి లేవడానికి బద్ధకమనిపించి అమ్మ పాలు వద్దంది అని లోపల్నించి అరిచి పాలు పోయించుకోకుండా పంపించేసింది.


పొద్దుటే లేచి పళ్ళు తోముకోవే అంటే అడవిలో సింహాలు, పులులూ రోజూ పళ్ళు తోముతాయా అని వితండవాదం చేసి గారెలు తింది.


స్నానం చేసి ఇంపోజిషన్ వ్రాసుకోవే అంటే నిద్ర లేవలేదు.ఇలా కూతురు చేసే ఘనకార్యాల లిస్ట్ చదివేసింది మృదుల.


పోన్లే.. ఏదో చిన్న పిల్ల అన్నాడు సృజన్.


ఇంత బద్ధకం పనికిరాదే అంటూ అరిచింది మృదుల మళ్లీ.

ఆలస్యం అమృతం.. అంటూ చెప్పబోతుంటే .. అమ్మా! అమృతం సీరియల్ రాత్రికి వస్తుందిగా అప్పుడు వ్రాసుకుంటా ఇంపోజిషన్ అని సమీర మళ్లీ ముసుగు తన్ని పడుకుంది.


Rate this content
Log in

Similar telugu story from Abstract