Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Swarnalatha yerraballa

Inspirational

4.7  

Swarnalatha yerraballa

Inspirational

యుద్ధం _ ఫలితం పాట

యుద్ధం _ ఫలితం పాట

1 min
734



రణరంగానికి రంగులుదిద్ది

హంగులతోటి గర్జన చేసి

రారమ్మంది ఆవేశం

కదన రంగానికి కదలికలొడ్డి

తూటాలను తెంచే ధైర్యం చేసి

 పోరాడమంది పౌరుషం

ఈ విలయతాండవ విన్యాసం లో విషాద గీతికలు

వినలేదా విశ్వమా

విలాప హృదయాల కలాపం చూస్తూ నెత్తురు

నదులను దాటు శక్తిని మరిచావ శాంతి కపోతామా


                        "రణరంగానికి "


గడచిన కాలపు యుద్ధపు వాసన మరిచావా మిత్రమా

చితికిన జీవిత జాడలు చిందిస్తున్న కన్నీరును చూడుమా

నిలువ నీడలేక నిమిషం ఒక యుగమూలా చేయడం న్యాయమా

సమరంతో సంతోషంగా అమర మకుటం ధరించగలమా

జనహృదయాలను జయంచిన అపజయమైనా జయమే సుమా


                       "రణరంగానికి "


స్మశానంలోని సింహాసనం శాంతి శంఖం పూరించేనా మిత్రమా

మారణహోమ మరణ మృదంగం చేయు మాయని

మచ్చను చెరప తరమా

నేల తల్లికై ఆరాటం నక్కివున్న నయవంచకులకు

చెలగాటం సుమా

నింగిని అంటిన నిప్పుల హోరులో నివురుగప్పిన

మోసాన్ని వీక్షించుమా

శక్తిని వ్యర్థం కానివ్వక యుక్తి బాటలో జయాన్ని చేరుమా

నేనంటే నేననే నినాదం ఆపి న్యాయమేదో నిషితంగా చూడుమా

                         "రణరంగానికి "



Rate this content
Log in