విజయ శిఖరం (prompt24)
విజయ శిఖరం (prompt24)
ఒకప్పుడు వంటింటికే పరితమైన మహిళ
నేడు కుటుంబ నిర్ణయాల్లోను
సంపాదనలోనూ పురుషులతో పోటీ పడుతూ
కుటుంబాన్ని సమన్వయ పరుచుకుంటూ
ఛాలెంజ్ లను ఎదుర్కొంటూ
మెట్టు మెట్టు ఎదుగుతూ
తనకున్న నైపుణ్యంతో అడుగుపెట్టిన
ఏ రంగమైననూ ఓర్పుతో చతురతతో
విజయ శిఖరాలు చేరుకుంటూ
ఎప్పటికప్పుడు ఎందులోనూ
తక్కువకాదని నిరూపించుకుంటు
బాధలను దిగమింగి చెరగని నగుమోముతో
తన పాత్రను సమర్ధవంతంగా పోషిస్తూ
అవమానాలకు కుంగక పొగడ్తలకు లొంగక
అణకువతో అలా అలా మహిలో మహిళగా
సాగిపోతుంది స్వార్థమెరుగని తన ప్రస్థానం