విజ్ఞానశాస్త్రవేత్తలు
విజ్ఞానశాస్త్రవేత్తలు
(బాలపంచపదులు )
మనిషికి యున్నది యాలోచన
క్రమక్రమంగా నిత్య పరిశోధన
జీవనగమనంలో యన్వేషణ
నిత్యనూతనమౌ యావిష్కరణ
లోకక్షేమమే పరమావధి జయా!
నిరంతరమెందరో మహా ఋషులు
చేసినారు నిత్యం తపస్సాధనలు
మానవాళికి నిచ్చి జ్ఞాన దీప్తులు
ప్రసాదించిరెనలేని సిరులు
వారే ఘన శాస్త్రవేత్తలు జయా!
ఎదుర్కొన్నారెన్నో కష్టనష్టాలు
మూర్ఖత్వానికి యడ్డు గోడలు
వేసినారు వీరెంతో సమర్థులు
తుదకు గెలిచిన మహా మహులు
విజ్ఞాన భాండాగారములు జయా!
సాంకేతిక నిర్మాణ సారథులు
సమాజ హితకారులీ ఘనులు
నిత్యపరిశోధనా దురంధరులు
పరోపకారులీ శ్రమజీవులు
ధీరగుణ సమన్వితులు జయా!
శాస్త్రవేత్తల పరిశోధనలు
మానవాళికి వెలుగు రవ్వలు
తమస్సును చీల్చే దివ్య ప్రభలు
భవితను నిలిపే భవ్య నిధులు
శాస్త్రవేత్తలు మన వేల్పులు జయా!
****************************