విడాకులు
విడాకులు
ప్రేమించే ప్రేయసినే..అడిగిచూడు విడాకులు..!
ఇష్టాలకు మౌనముగా..ఇచ్చిచూడు విడాకులు..!
ఎఱుకకలిగి బ్రతికిపోవు..ముచ్చటదే మనోజ్ఞం..
అడ్డుతగులు మోహానికి..పంపిచూడు విడాకులు..!
ఆశకెంత ఆరాటం..నిప్పుతోటి ఆడునే..
ఆశయాల సాధనలో..నవ్విచూడు విడాకులు..!
ఎవరితప్పు లెంచేవట..రెప్పవాలి పోయాక..
తపమైనా జపమైనా..తరచిచూడు విడాకులు..!
కల'వరమని అనుకుంటే..కలవరమే మిగిలేను..
కలతలెక్క డున్నాయిక..వదిలిచూడు విడాకులు..!
ప్రియుడెవరో ప్రేయసెవరొ..ఎంతవింత నాటకం..
నీ వాడని వేదననే..జరిగిచూడు విడాకులు..

