TOMORROW
TOMORROW
TOMORROW..
రేపు...
రేపు...అన్నది...
నీ మదిలో... యెన్నో తలపులు రేపు
తలపులే ....
నీ జీవితాన తీసుకొచ్చు.. మలుపు
మలుపు మలుపు...లన్నీ కలిపి
జీవితాన తెచ్చు...మార్పు!
ప్రతి వ్యక్తి జీవితం లో...
రేపు..అనేది.. యెన్నో ఆశలు రేపు
ఏలనంటే..
ఎవరూ చూడనిది
చూస్తామో లేదో కూడా
తెలియంది...రేపు
మానవుడికి...
చూడని వాటిపైనే మక్కువ..
చూడని వాటికోసం...
తెలియని వాటికోసం..
అవుధులులేని..ఊహలు ఎక్కువ
హద్దు పెట్టే వారుండరు...
అడ్డు చెప్పే వారుండరు
అందుకే....రేపు..
అన్నది తెస్తుంది...మార్పు
అది.. ఆశా నిరాశల కూర్పు
రేపు.. అన్నది
అత్యంత...సాధారణం
కానీ..
దానికై ఎదురు చూసే...
కోట్లాది మంది ఆశా వాదులకు
అదే..ఆధారం
నిరాశా వాదులకు..ప్రాణాధారం
రేపు..
చీకట్లో ఉన్నవారికి వెలుగునిస్తుంది
చింతల్లో ఉన్నవారికి .. చేయందిస్తుది
......రాజ్.....