తన నవ్వులు
తన నవ్వులు
1 min
0
తన నవ్వుల మాటునున్న..బాధెవ్వరు మాన్పగలరు..!?
తన కన్నుల నీటిసుడుల..గొడవెవ్వరు మాన్పగలరు..!?
ఆత్మీయత పంచగల్గు.మనసేగా ప్రియనేస్తం..
తన మనసున అలముకున్న..కలతెవ్వరు మాన్పగలరు..!?
బిడ్డ ఆకలెరిగి తీర్చు..అమ్మ కదా తొలి దైవం..
అలుపెరుగని కన్నతల్లి..నలతెవ్వరు మాన్పగలరు..!?
తన ఆకలి దాహాలను..మరచునుగా ఎన్నిమార్లొ..
మాతృమూర్తి ఆవేదన..వ్యథనెవ్వరు మాన్పగలరు..!?
బంధుమిత్రు లెవరికైన..సాదరమున సేవచేయు..
ఇల్లాలిగ తానుపడే..శ్రమనెవ్వరు మాన్పగలరు..!?
