Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4.7  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

THE THOUGHT

THE THOUGHT

1 min
386


THE THOUGHT 

----------- --------- -----------

పక్షికి రెక్కెల్లా... చేపకు మొప్పల్లా

కలువకు చంద్రుడి లా..కమలానికి సూర్యుడు లా

విత్తుకి వాటర్ లా...ఎర్త్ కి ఆక్సిజన్ లా

మనిషికి... అలోచన!


నిండిపోయింది ప్రపంచం..ఆలోచనలతో

ఆలోచనలకే గనుక రూపం ఉంటే...

గ్రహాలన్నీ... సరిపోవు వాటిని దాచి ఉంచేందుకు

విశ్వం వెర్రెత్తిపోతుందేమో...

ఈ అనంతానంత ఆలోచనలు 

ఎక్కడ ఉంచాలో ఊహించేందుకు


మానవుడు

ప్రాణంతో ఉన్నాడంటే

అతని ఊపిరి సాక్ష్యం

జీవంతో ఉన్నాడంటే

అతని..ఆలోచనే సాక్ష్యం


మానవుడు...

ఈ నేలపై అడుగు పెట్టింది ఏకాకి లా

అతని ఆలోచన కూడా.. ఏకైకమేగా

కానీ...

తన మెదడులోనే..పురుడు పోసుకున్న

ఎన్నో ఆలోచనలకు...

ప్రాణం పోసే..ధైర్యం లేక తెగింపు లేక

తన చేతుల్తో..తానే..గొంతు నులిమేస్తున్నాడు

గుంపులో గోవిందా అని కలిపేస్తున్నాడు


ఒక మేధావి ఆలోచనలు..

ఎంత ఉన్నతంగా ఉంటాయో..

సిగ్మండ్ ఫ్రాయిడ్..

ఐన్ స్టైన్..

వివేకానందుడు..చూపిస్తే

ఒక నియంత ఆలోచనలు

ఎంత క్రూరంగా ఉంటాయో..

హిట్లర్.... సద్దాం హుస్సేన్

ఔరంగజేబు...లాంటి వాళ్ళు చూపారు


ఒక అహంకారి ..ఆలోచనలు ఎలా ఉంటాయో నేడు ..పుతిన్ చూపిస్తున్నాడు


విచిత్రం ఏమిటంటే...

వీరంతా..వాల్ల వాల్ల ఆలోచనల వల్లే

నియంతలుగా..మేధావులు గా..

అహంకారులుగా..అవతరించారు

నియంతలు ఆయ్యాకే...

మన అందరి ఆలోచనలను... నియంత్రించారు


అందుకే...

ఆలోచనకున్న శక్తి..ఎంతో

ఆలోచించి చెప్పే శక్తి ఏ ఆలోచనకు లేదు


ప్రపంచం ఆలోచనలతో నిండటం..ముఖ్యం కాదు

ప్రచండమైన ఆలోచన నీ మెదడులో..

జనియించటం ముఖ్యం


       .......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Action