తెల్లవారే
తెల్లవారే


తెల్లవారే తెల్లవారే
నిదుర లేవరా 'పురుషోత్తమా',
'వేణు'గానము విన్న 'భాస్కరు'డే వడివడిగా వచ్చువేళ నీకు నిదురఏలరా,
ఆలోచనా లోతుల్లో
మత్తు వీడమన్న 'రఘు'మాట ఆలకించవేమిరా,
అర్ధంకాని నీ తత్వం 'లత'లా అల్లుకుపోతే ఏలరా,
సింగారము లొలకబోయు
నీ అందం 'సత్యనారాయణ'స్వరూపమే కదరా,
నటనకు చోటులేని నీమనసు
వ్యాహ్యాళి మిత్రులపై
'కరుణ' చూపాలిరా,
చిన్ననాటి జ్ఞాపకాలు
'సాగరం'లో కలిపేస్తే ఎట్లారా,
'భవాని'రూపంలో అమాయకత్వం చూడలేము కదరా,
చెలిమివనం ముచ్చట్లే మనకు 'వెంకటేశ్వర'సుప్రభాతం కదరా,
'
శ్రీనివాసు'డి మనసు
కనిపించక నడిపించే శక్తిరా,
నిత్యప్రేమ బృందావనం
'రాధాకృష్ణు'ల
మధుర ప్రేమలోకం కన్నా
మన 'నవ్వులు పువ్వుల' లోకమే మనకు మిన్న కదరా,
'జయలక్ష్మి'ని స్తుతించినా 'పాండురంగ'డిని ఆరాధించినా
ఫలితపు 'శోభ'
మనందరిదీ కదరా,
వికసిత 'పద్మ'o లో పరిమళమే మనమురా,
విరహానికి తలుపువేసి
వినోదాల తలపు తెరచి
జాగుచేయక కదిలిరారా,
'చంద్రశేఖరు'ని వెన్నల
అవనిపై 'జాన'అయినా లేదురా,
చెలిమి పూలవనం
నవ్వుపూల దీపాలతో నిండితే
చింతలు చిత్తమునుండి వైదొలుగునుర