STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

స్వప్నమది

స్వప్నమది

1 min
178



ప్రతిచినుకు రాగాల..తాళాల స్వప్నమది..! 

ఏడేడు వర్ణాల..హాసాల సంద్రమది..! 


హోలీగ నిత్యమై..యేఱులై పొంగునే.. 

మధుమాస భోగాల..మధుపాల గానమది..! 


జాబిలికి వెన్నెలకు..పొత్తసలు ఎప్పటిదొ.. 

కురిసేటి సరసాల..మధుశాల మౌనమది..! 


ఏ నెమలి పింఛాల..నీలిమల గగనమో.. 

చెలికనుల నాట్యాల..తీర్థాల కావ్యమది..! 


చిగురించు కోరికల..చైతన్య వాహినియె.. 

కలహంస విరహాల..మోహాల కలహమది..! 


సప్తమీ తత్పురుష..కర్మధారయ వేళ.. 

ప్రకటమౌ గంధాల..ప్రాణాల కేంద్రమది..! 


Rate this content
Log in