Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Abstract

4.5  

Eevani Ravisankara Sarma

Abstract

సోదరి

సోదరి

1 min
435


అక్కైనా చెల్లైనా సోదరిగా ఒక్కతే ;

ఆప్యాయత ఒక్కటే .

అక్కైతే మమత ఎక్కువ ,

చెల్లైతే ముద్దు ఎక్కువ .

ప్రేమలో అమ్మను మరిపించే ,

ఆలంబనలో నాన్నను తలపించే .

ఇద్దరూ అనురాగపు జల్లులే ,

అభిమానపు వెల్లువలే .

వారు దేవుని బహుమతులే ,

లేరంటే భారతీయులందరూ సహోదరులే .


సృష్టికర్తలు తల్లిదండ్రులు ;

ప్రతిబింబాలు సోదరసోదరీమణులు .

నదిలో అలల్లా ,

సముద్రంలో కెరటాల్లా ,

ఆకాశంలో మేఘాల్లా ,

వనంలో వృక్షాల్లా ,

విశ్వంలో నక్షత్రాల్లా ,

విడదీయరాని బంధాలు .

ఇంట్లో సేవకులుగా ,

పాఠశాలలో స్నేహితులుగా ,

శుభకార్యాలలో ఆత్మబంధువులుగా ,

జీవితంలో ప్రాణమిత్రులుగా ,

చూడముచ్చటైన బాంధవ్యాలు .


పరిచయము కలుగును :

' నా సోదరి ' అని , ' నా సోదరుడు ' అని ;

గౌరవము పలికించును :

మంచి మనిషని , అపురూపమని .



Rate this content
Log in

Similar telugu poem from Abstract