స్నేహమేరా జీవితం
స్నేహమేరా జీవితం


కల్మషం లేని తొలి
సంధ్య వెలుగే స్నేహం-
అందమైన స్నేహ బంధం
అన్ని వయసులలోనూ
కావాల్సిన చెలిమి బంధం;
నవ్వులు పువ్వులు పూయించే
అనురాగ బంధం ఎన్నడూ
చేజార్చుకోకుమిత్రమా
,ఏ మానవ బంధానికి సరితూగని
బంధం ఒక్క స్నేహ బంధమే!
కలుపుకునే బంధం కాదది
నిత్యమై నిలిచిపోయే భావం;
కడదాక కట్టె కాలేదాకా ఇమిడి
పోయే బంధం, ఆశాంతిలోను
ప్రశాంతతనిచ్చేది స్నేహం;
కనురెప్పల మాటున కన్నీళ్ళను,
ఎదలోయల్లో దాగిన దుఖాన్ని
దూరం చేసి తోడుగా నిలిచేది స్నేహం
కలుపు మొక్కలను పెకి
లించి
గంధపు మొక్కలను నాటుతుంది
కులమత వర్గాలు ఎరుగనిది
కుళ్ళు కుతంత్రాలు తెలియనిది
పేద గొప్ప తేడాలు కనపడనిది
ఎల్లవేళలా అమరమై నిలిచేది
స్వఛ్ఛమై నిత్యమై భాసిల్లేది,
స్నేహమే శాశ్వతమని తెలుసుకో!
మిత్రమా ,సమయం మించిపోలేదు
మాట తేడా వచ్చినా
మనసు నొప్పించినా
మరుక్షణమే మరచిపో!
మనసు గుట్టువిప్పి మర్మాలను
ఎదముంగిట పెట్టు ,
నీ సాంగత్యానికి,నీ ఉపిరికి
ఉత్సవాలు చేస్తుంది స్నేహం,
అంతరంగపు ఊరటనిచ్చేది స్నేహ బంధమే!
నిన్ను నీవు మరిచేటంతగా నిన్ను గెలిపిస్తుంది
అదే స్నేహనికున్న నిండుతనం, మూలధనం