స్కూలు- పిల్లలు
స్కూలు- పిల్లలు
నిన్నెవరో నా రబ్బర్ కొట్టేసారు
ఈ రోజు పెన్సిల్ దొరికింది
మధ్యాహ్నం అన్నం తినలేదా
జెండాల పండుగకి రంగుల కాగితాలు తెద్దాం
అమీబా బొమ్మ గీసావా
లెక్కలు చెయ్యలేదు
గ్రౌండ్ లో పరుగెట్టావా
బట్టలకు ఏదో అంటుకుంది
నిమ్మొప్ప్పులు తీసుకున్నావా
ఉసిరికాయ తిని నీళ్ళు తాగు
స్టడీ అవర్స్ ఎక్కడ
ఇంటికి వెళ్ళి లేటుగా వచ్చావ్
అమ్మో ఇవాళ పేపర్లు ఇస్తారు
ఒక్కో మార్కు తగ్గితే..
రేయ్ నీ పక్కన కూర్చుంటే బిట్లన్నా చెప్పు
అందరికీ బాలల చిత్రాల ప్రదర్శన
సైన్స్ ఎగ్జిబిషన్ కి నేనూ వెళ్తా
ఈ కెలిడియోస్కోప్ చూడు
ఫ్యాన్ చూడు ఎలా తిరుగుతోందో
యూనిట్ టెస్ట్ ఎప్పుడు
నాకీ రోమన్ నెంబర్స్ నచ్చవు
బోర్డు మీద పేరు రాస్తా
టీచర్ చెప్పారు
ప్రేయర్ లో నువ్వే పాట పా
డాలంట
ప్రతిజ్ఞ నేర్చుకో..
