శిల్పి
శిల్పి
శిల్పి
ఉలి సాధనంతో
రూపం లేని రాయిని సైతం
అందమైన ఆకారంగా మలచి
సుందర భావాలు అద్ది
సప్తవర్ణాల శోభితాలతో
సౌందర్యం సృష్టించిన
అద్భుత చాతుర్యం
శిల్పి సొంతం
మట్టి ముద్ద లాంటి
మస్తిష్కంను
జ్ఞానాన్ని విజ్ఞానాన్ని
పంచే అద్భుత భాండాగారం గా
మలచిన నైపుణ్యం
గురువనే శిల్పికే
సాధ్యం
ఆవిరవుతున్న ఆయువుకు
తన పరిజ్ఞానం తో
జీవం పోసి
గుండె కోత గల ఎందరికో
ప్రత్యక్ష దేవుడిగా
మారిన వైద్యుడనే
శిల్పి అద్భుతం
అందని ఆకాశంను
అందుకొని
అంతరిక్షంలో అత్యద్భుతాలను
అరచేతిలో ప్రపంచాన్ని
అరక్షణంలో కళ్ళెదుట
సాక్షాత్కరింప జేసిన
శాస్త్రజ్ఞుడనే శిల్పి
అత్యద్భుతం
ఇలా..ఎందరో శిల్పు లకు
జీవం పోసిన ఆ విధాత
మహాద్భుత శిల్పి కదా!