శీర్షిక: కాలానికి ఇరువైపులా తానే!
శీర్షిక: కాలానికి ఇరువైపులా తానే!
సాధించడమే శ్వాసగా
ఉగ్గుపాలతో నూరిపోసి
సంపాదనే ధ్యేయంగా
మార్చిన మరబొమ్మ తాను!
సంస్కృతి సాంప్రదాయాలను
చాదస్తం పేరిట వదిలి
ఎదగాల్సిన వయసులో
ఎగిరిపోవటం నేర్పబడిన గువ్వ తాను !
అభ్యుదయం అనే రెక్కలు తొడిగి
లక్ష్మణ రేఖను దాటి
దారం తెగిన గాలిపటంగా మిగిలింది తాను!
లేత కమలాన్ని గుచ్చే గులాబీలా చేసిన
గుడ్డి సమాజంలో చంద్రముఖిగా సృష్టించబడింది తాను!
విత్తనంలో ఏముంది తప్పు
నారు పోయడంలోనే దాగుంది ముప్పు
నాణెనికి బొమ్మ బొరుసులా
కన్నీటి కడలి తానే
కష్టాల ఉప్పెన తానై
లోకం చేసిన గాయానికి పచ్చబొట్టులా
కాలానికి ఇరువైపులా నిలిచింది తాను !!
-జ్యోతి మువ్వల