సగరపు సుందరి
సగరపు సుందరి


సగరమా నీ సరిగమ భళాభళి,
జడగంటల నాట్యంతో మనసును ముద్దాడిన ఆనందిని భళాభళి,
మరు మల్లెలను కవ్వించే విలాసిని
అందుకో అభినందనలు.
విందుచేయు సొగసులతో
మగువ మనసు దోచుకున్న దేవేరి
చింతలను మాటుమాయం చేసేటి దరహాసి
కురుల మెరుపు కావ్యంలో
అధరపు రసగుళికల మాధురి,
కన్నులింటి పండుగలా
అలరించు సంతోషనిధి,
ప్రేమసీమ ఏలేటి సౌందర్యసిరి
అందుకో అభినందనలు.
వలపుగీతుల పల్లవైన రాగమంజరి
సత్యమేదో చెప్పాలని
సరసకు వస్తే
బుసకొట్టే నాగువైతే ఏలనే గడసరి,
సహజంకాని నీఅందం
ఎవరికి గొప్పే అహంకారి,
అలంకారపు చిత్తములో మిధ్యను వదిలేయవే సౌందర్యారిధిని,
దర్పాలకుపోని ఆత్మీయతే
నీ మనోసౌందర్యమైతే
నీకై ఆలపించిన స్వరాలే
మదిలో నిలిచిపోవు సుందరి.