రంగులెన్నొ
రంగులెన్నొ

1 min

194
ప్రవహించే కన్నీటికి..రంగులెన్నొ చెప్పరాదు..!
దిండుకన్న ఇముడ్చుకొను..నేస్తమెవరు ఉండరాదు..!
ఎవరితోటి చెబితేనో..తీరేదా ఆవేదన..
అనుభవాల హోళీయే..జరుగుతుంటె చూడరాదు..!
పల్లవించు వసంతాల..ఎగతాళియె విందుకదా..
గుండెచాటు గొంతువిప్పి..పాడుకోను పొంగరాదు..!
శివుడే దయతలచకుండ..శిశిరమేల తప్పుకొనును..
మనసు మంచి మల్లెపూవు..ఎన్నటికీ వాడరాదు..!
కాలమెంత కరుణామయి..పాఠాలను నేర్పుటలో..
బాధించే ముళ్ళేవో..గమనిస్తూ ఎదగరాదు..!
నదులేవో కడలులేవొ..మబ్బులెపుడు కురిసినవో..
హృదయగగన వీధులేలు..మెఱుపల్లే నవ్వరాదు..!