రంగు రంగుల హోళీ
రంగు రంగుల హోళీ

1 min

160
రంగు రంగుల హోళి,
ఆనందాల కేళి.
రంగుల ప్రపంచంలో
మనసు రంగుమారని అనురాగ చెలిమే హోళి,
ప్రేమలు తెలిపేటి మిత్రుల
చిరునవ్వుల కేరింతే హోళి,
పల్లవించు వసంతాల
సంతోష సరాగమే హోళి,
సుగంధాల వనములో
పరిమళ స్నేహపు ఊసే హోళి,
అందుకోండి మిత్రులారా హోళి పండుగ శుభాకాంక్షలు.
మదినేలే స్నేహపు మనసుచెప్పే కబుర్లే హోళి,
రాలేని మిత్రుల గుండెచాటు
గొంతుగోడే హోళి,
అందమైన విషయ విశేషశాల
అనుభూతే హోళి,
ఆడుదాము ప్రతియేడు అందరం హోళి
పున్నమింటి చంద్రుని హృదయ గగన వీధుల్లో ఆనందకేళి.