పుట్టిల్లు
పుట్టిల్లు
పుట్టిల్లు..ఈ పదం వినగానే మగువ మోముపై చిరునవ్వు ఉదయిస్తుంది
బాల్యం, కౌమార్యం, యవ్వనం ఈ మూడింటి జ్ఞాపకాల మధురిమల గని పుట్టిల్లు
మెట్టినింట ఎన్ని సిరిసంపదలు ఉన్నా! పుట్టిల్లు నుండి తెచ్చిన గుప్పెడు పసుపు,కుంకుమ తన సౌభాగ్యముగా భావిస్తుంది అతివ
అమ్మలోని అనురాగం, నాన్నలోని మమకారం, అన్న లోని అధికారం, అక్కలోని ఆప్యాయత ఇవే ఆడపిల్లకి పుట్టిల్లు నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు