పులకించే
పులకించే
నీ పిలుపు వినినంతనే మనసు పులకించే
జ్ఞాపకం తలచి నంతనే మది పరవశించే
నీ అడుగుల సవ్వడి నా మదిలో అలజడి రేపే
నిశ్శబ్దం ఏమో ఆవరించి నంతనే మైమరపించే
స్వప్నాలు అన్నీ మధురాలే సత్యమైతే వింతే
మేఘాలు ఆగక ఎటో కదిలి నంతనే మురిపించే
జీవితం అంటే లేని వాటి కోసం ఎక్కువ ఆశించడమే
సంతృప్తి చెందని వాటి కోసమే తపించి నంతనే కలవరించే
నిరీక్షణలో కాలమే చెప్పాలి సమాధానం దొరకదు నిజమే
వాస్తవం లేదని మది ఆలస్యంగా గ్రహించి నంతనే ఓడించే