ప్రతిసారీ
ప్రతిసారీ
నా దేవర తానేనని కొలచినాను ప్రతిసారీ
ఆ మూర్తికి అర్చనలను జరిపినాను ప్రతిసారీ
తానే కనబడకుంటే నిదురకూడ కరువైనది
కనులలోన ఆ రూపును నిలిపినాను ప్రతిసారీ
మధువులు ఉంటాయన్నది తొలిసారే తెలిసెనులే
మరిపించే తన మాటలు వలచినాను ప్రతిసారీ
ఎడబాటన్నది తెలియదు ఎదనే గాయము చేయదు
మమతలున్న బంధాన్నై ఒదిగినాను ప్రతిసారీ
అలుకల రారాజేనని కనుగొంటిని ఓ వసంత
మురిపముగా అతని పేరు పిలచినాను ప్రతిసారీ
