ప్రతి నిత్యం నటిస్తున్న
ప్రతి నిత్యం నటిస్తున్న


నిత్య సంఘర్షణే జీవిత ప్రయాణం
ఎన్నో మలుపుల తీరపు దారులు
నాలుగు పాదాల్లో నుంచి మొదలు
మూడు పాదాల ముగింపు వరకు..
తల్లి గర్భంలో బిగించిన పిడికిలి
భవిష్యత్తులో చేతి రాతలయ్యేనా
నొసటి గీతలు ఆయువు లెక్కిస్తే
బ్రతుకంతా బంగారంగా సాగుతుందా..
ప్రపంచ రంగస్థలంలో పాత్రధారులుగా
ప్రతినిత్యం నటిస్తూనే ఉన్నాం
రంగులు లేని ముఖాలతో ప్రదర్శిస్తూ
మట్టి వరకు నాటకాన్ని రక్తి కట్టిస్తున్నాం..
ఋతువులన్నీ అనుభవిస్తూ
మూడు కాలాలతో ముచ్చటిస్తూ
సంవత్సరమంతా కలయ తి
రుగుతూ
జీవితపు వర్ణ పంటను అనుభవిస్తున్నాం..
ఎన్నో అనారోగ్యాలను గమనించి
సుందర రూపము కోసం తపించి
శస్త్ర చికిత్సలు నిత్యం చేసుకుంటూ
కాలానికి పోటీగా నిలవాలనుకుంటున్నాం..
చెప్పే నీతులకు పొంతన లేని పనులకు
వ్యత్యాసాలు ఎన్నో చూపుతూ
మంచితనం అనే కిరీటం నెత్తిన మోసేందుకు
ఎన్నెన్నో అబద్ధాలు సృష్టిస్తున్నాం..
పురాణ కథల్లో మనుషుల్లా బ్రతికేందుకు
ఊహల రాతలెన్నో సృష్టించుకుని
లోకంలో రాతి విగ్రహాంగా నిలిచేందుకు
మనసును రాయిగా మలిచి పెట్టుకున్నాం..