Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.5  

Ramesh Babu Kommineni

Romance

ప్రణయమా..

ప్రణయమా..

1 min
293


ప్రణయమా పల్లవించవా మారు మాటాడక

హృదయమా కనికరించవా ఏమి పోట్లాడక

ఎదురు చూసిన ఎదలోన ఏరువాకలాయెనే

కుదురు మరిచి మనసే తలమునకలాయెనే

ప్రణయమా పల్లవించవా మారు మాటాడక

హృదయమా కనికరించవా ఏమి పోట్లాడక


ఏరు పొంగు ఎడద మొత్తమూ ఆవరించెను

పైరు హంగు పడుచుదనమంత వివరించెను

ఎక్కడదో ప్రల్లదనమే పరవళ్ళై ప్రవహించెను

అక్కడేదో ఆరావం అల్లరిగ తనువూగెంచెను

ప్రణయమా పల్లవించవా మారు మాటాడక

హృదయమా కనికరించవా ఏమి పోట్లాడక


ఊసులన్నీ మర్రి ఊడలై మదిలోను అల్లెనూ

బాసలన్నీ వెర్రి ఊహలై హృదినే వెదచల్లెనూ

ఊసులన్నీ మర్రి ఊడలై మదిలోను అల్లెనూ

బాసలన్నీ వెర్రి ఊహలై హృదినే వెదచల్లెనూ

ప్రణయమా పల్లవించవా మారు మాటాడక

హృదయమా కనికరించవా ఏమి పోట్లాడక

ఎదురు చూసిన ఎదలోన ఏరువాకలాయెనే

కుదురు మరిచి మనసే తలమునకలాయెనే


Rate this content
Log in

Similar telugu poem from Romance