ప్రమిదల్లో కాసిన వెలుగు పువ్వులు
ప్రమిదల్లో కాసిన వెలుగు పువ్వులు


కృష్ణుని చెంత నిలిచి సత్యభామ
విల్లునే ధరించి శరం సంధించే
లోక కంటక నరకాసున్ని వధించి
దుష్ట సంహారం గావించే...!!
చీకటి అమావాస్యకు
దివ్వెల రంగోలి కల్పించి
అంధకారపు అజ్ఞానం తొలగించి
నేలపై దీపపు కాంతులు వెదజల్లే...!!
ప్రమిదల్లో కాసిని వెలుగు పువ్వులు
ప్రహరీ గోడ పై కాంతులు విరజిమ్మే
చిరునవ్వులతో చిరు దీపం
చీకటి ప్రపంచానికి పయనించే..!!
ఆనందపు చిచ్చుబుడ్లు
రంగులు చిమ్మే కాకర పూలు
చెవుల్లో హోరెత్తే టపాకాయ
లు
చిన్న పెద్ద ముఖాల్లో నవ్వుల వెలుగులే..!!
ప్రతి చోటా వికసించే దీపావళి
ప్రతి పల్లెలో విరబూసే ఆనందం
జీవితంలో వెలుగుల రూపావళి
పర్వపు వెలుగులో ధరణి కొత్త కాంతి..!!
ఇంటి ముంగిట దీపపు కాంతి
ప్రతి మనసులో నిత్య క్రాంతి
సాయపు సంధ్య జ్యోతుల కిరణం
నేలపై కురిసిన కాంతుల సిరులు..!!
పండుగ పరమార్థం వెలుగు
చీకట్లో మెరిసే మిణుగురు అనందం
దీపపు సెమ్మెలో జ్యోతి
ఎన్నో జీవితాలకు జీవం పోస్తుంది...!!