ప్రకృతి..
ప్రకృతి..


పుడమి ఒడిని తడిమి తడిపి
పులకరించి మురిసిపోయిన
తొలకరింతపు చిరుజల్లులా
తొట్రుపాటు లేక భువికి వచ్చిన
చకి వణికి తొణికి వచ్చిన
చిత్రమైన నిప్పుకణికలా
కంటి కొలకుల నీటి చెలమలా
కంటి నుండి చెక్కి తాకితే
రగులుతున్న చిత్త వ్యథలా
రంగవల్లుల బ్రతుకు కథలా
సాగిపోయిన నారుమళ్ళలా
సాగుతున్న ఏరువాకలా
నీటి రాగం ఏటి వంపులా
నీటి అలల కొత్త నాట్యంలా
బావురుమన్న కృష్ణ కేసీ
భావుక(వి)తా హృదయం