ప్రేమ తరంగాలు
ప్రేమ తరంగాలు
ఉవ్వెత్తు న లేచింది సంద్రంలో ఒక అల
ఒడ్డును చేర గానే చెదిరింది దాని కల!
తరలి వచ్చిన సంద్రపు ఆలు చిప్పలు
మరల లేక ఒడ్డునే రాళ్ల మధ్య పడే చిక్కులు
ఆమె మేల్ ముసుగు సందుల చూపులు
నా మది లోనికి దూసెను ప్రేమ సుమ తూపులు !
నీ చూపుల వల లో చిక్కిన నా తలపులు
ఒడ్డున చిక్కిన ఆల్చిప్పల కరణి తిరిగెను మలుపులు!
కడలిని పుట్టిన ఈ ప్రేమ అనే హాలాహలం
శంకరుడనై మ్రింగి నిలిపితి కంఠమున కలకాలం

