Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"ప్రేమ ఖైదీ"

"ప్రేమ ఖైదీ"

1 min
302


"అప్పటివరకూ ఏ అమ్మాయినైనా కన్నెత్తి చూడడానికి కూడా సిగ్గు పడిన నా కనులు, ఆ క్షణం ఎందుకో నిన్ను చూడగానే రెప్ప వేయడానికి కూడా ఇబ్బంది పడ్డాయి.

అనుకోకుండా దగ్గరై, నాకు కంటి మీద కునుకు లేకుండా చేసింది నీ రూపం...!

ఆకస్మికంగా దూరమై, నాకా పగటి కలలును సైతం

మిగిల్చింది నీ కోపం...!

ఈ మూడెళ్ళ సుదీర్ఘ ఒంటరి ప్రయాణంలో

నీకై నిరీక్షిస్తూ...

నీతో గడిచిన ఆ పది నెలల గతాన్ని గుర్తు చేసుకుంటూ...

నీ ఊహలతో, నీ ఆలోచనలతో మిగిలిన భవిష్యత్తును ఊహించుకుంటూ...

సాగిన ప్రతిక్షణం ఒక పువ్వులా చిగురించి, పూదోటల మహావనంలా విస్తరించినా....

నువ్వు ఇక రావు, నా సొత్తు కాదన్న ఆ కల నుండి బయటకి వచ్చి, ఆ కటిక వాస్తవం జీర్ణించుకుంటుంటే మాత్రం, క్షణాల్లోనే ఆ అందమైన పూదోటంతా ఒక ముళ్ళ పొదరిల్లులా, ఆ మహావనమే చివరికి ఓ పద్మ వ్యూహమయ్యి నన్ను బంధించిందా అన్నట్టు అనిపిస్తుంది.

అవును ...!

నేనొక ప్రేమ ఖైదీని!

నీకు ప్రేమను పంచిన నేరానికి,

నీ ప్రేమనే యావజ్జీవ శిక్ష విధింపబడి,

నీ ప్రేమవలపు సంకెళ్లతో,

నీ మనసు కారాగారంలో బంధింపబడ్డ నేనొక ప్రేమ ఖైదీని!!

నువ్వు కాదన్నావని

నీకిచ్చిన మనసు అప్పు కాదు, వడ్డీతో సహా వసూలు చేసి తిరిగి వేరొకరి దగ్గర తాకట్టు పెట్టడానికి.

నువు కాదన్నా...! ఔనన్నా...!!,

నువు నాతో ఉన్నా...! లేకపోయినా...!!,

నువు వచ్చినా...! రాకపోయినా...!!

నువు నాకు చేరువైనా...! దూరమైనా...!!

నిన్ను కోరుకున్న మనసు,

ఈ జన్మకు అది నీకు మాత్రమే అంకితం."

Satya Pavan Writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract