Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Phanikiran AK

Classics Others

4  

Phanikiran AK

Classics Others

పల్లె నవ్వింది

పల్లె నవ్వింది

1 min
327


పల్లె సీమలు దేశానికి పట్టు గొమ్మలు ...


ఆ మాటకు అందంగా..... పల్లె నవ్వింది


రైతే రాజంటూ నినాదాలు విని


నిండుగా...... పల్లె నవ్వింది



పండుగలకు తరలి వచ్చు


బిడ్డలను చూసి


మనసారా....... పల్లె నవ్వింది



పాశ్చాత్యం పలకరించి


బిడ్డలకు రెక్కలు తెచ్చినా


పసిపాపలా ......పల్లె నవ్వింది



పట్నవాసపు పొగరు బురదంటూ ఛీ కొట్టినా


పసితనం అని...... పల్లె నవ్వింది



భోగాలకు బానిసలై


ఏమున్నది ఇక్కడ


కంపుగొట్టు తనం తప్ప


అంటూ ఈసడించినా


కన్నీళ్లను దాచి.... పల్లె నవ్వింది



అభివృద్ధికి అడ్డం


నీవే అవరోధం


తప్పుకో అంటూ తోసేసినా


పచ్చగా ఉండమని..... పల్లె నవ్వింది



కాలుష్యం కాటువేసి


శరీరానికి నిలువెల్లా తూట్లు చేసి


పీల్చి పిప్పి చేసి


రోగాలను కానుక చేసి


జీవన మార్పు నీకు మేలు అంటే


అమ్మా అని ఆర్తిగా పిలుస్తూ


తిరిగి వచ్చు బిడ్డలను చూసి


చేతులు చాచి


అక్కున చేర్చుకుని


ఎదనిండుగా ...... పల్లె నవ్వింది.


********%%%%*********


ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు.


Rate this content
Log in

Similar telugu poem from Classics