పాఠశాల
పాఠశాల

1 min

174
మనచుట్టూ ప్రపంచమే చదువునేర్పు పాఠశాల
మనసుపడిన రోగానికి మనఇల్లే వైద్యశాల
క్రితంజన్మ అద్దానికి ఈజన్మే ప్రతిబింబం
మంచిచెడులు మసలుతున్న మనబ్రతుకే కర్మశాల
కనులుమూసి పాలుతాగు పిల్లిలాగ నడయాడకు
నువుచేసిన కర్మలతో నివశించే మర్మశాల
ఆలుమగల అవగాహన కల్పించిన గృహసీమే
మంచిపనుల పుడకలతో కట్టుకున్న పర్ణశాల
ప్రతిజీవీ పుట్టుకకూ అర్ధంవుండాలి "చల్లా"
పదుగురికీ పనికొచ్చే జీవితమే ధర్మశాల