STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

ఓ సండే

ఓ సండే

1 min
4


వచ్చి వెళుతు ఉంటావా..కరుణలేని ఓ సండే..! 
మండిపడే మండేనే..ఆపలేని ఓ సండే..!

బడికెందుకు పోవాలో..చదివి ఏం చేయాలో.. 
సరియైన జవాబొకటి..ఇవ్వలేని ఓ సండే..! 

ఆటాపాటలా చదువు..నేర్పించే తీరేదట.. 
కాలంతో పోటీలో..గెలవలేని ఓ సండే..! 

అమ్మమ్మలు నాన్నమ్మల..ఆశ్రమాలలోనేనా..
అమ్మనాన్న గొడవల్లో..ఆగలేని ఓ సండే..! 

కులాల మతాల చిచ్చులు..దైవం పేరిట క్రీడలు.. 
చూస్తూ చూస్తూ ఏమీ..చేయలేని ఓ సండే..! 

డాక్టరులో ప్లీడరులో..లీడరులో ఎవరైతేం.. 
అవినీతిని అరికట్టే..చేవలేని ఓ సండే..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics