ఓ భావం
ఓ భావం


మూసిన నీ కనురెప్పల మాటున నేనున్నానని....
కాదు ..నేనే ఉన్నానని తెలిసినపుడు...
ముత్యం లాంటి బాష్పకణ మొకటి నన్నంతా సంతోష
సంప్రోక్షణ చేస్తూ....
మూసిన నీ కనురెప్పల మాటున నేనున్నానని...
కాదు ..నేనే ఉన్నానని
తెలిసినపుడు...
నీ వాకిట ముచ్చటైన ముగ్గురా నిను మురిపిస్తూ
నను నేనే మరుస్తూ మౌనమైన మౌనాన్నై చూస్తూ...
మూసిన నీ కనురెప్పల మాటున నేనున్నానని...
కాదు..నేనే ఉన్నానని
తెలిసినపుడు...
మూగ అల తాకిన తీరంలా తరిస్తూ తమకపు దరుల చేరి మోహనమై నిన్నే చూస్తూ...చూస్తూ...
మూసిన నీ కనురెప్పల మాటున నేనున్నానని...
కాదు ..నేనే ఉన్నానని తెలిసినపుడు...
మూగి..ఎన్ని జన్మల చాయ లో చిత్రమై ముసి నవ్వుల పెద వుల కదలాడుతూ...
ఆడుతూ....నన్నో మధుర వాసంతికనుచేస్తూ..చేస్తూ...