Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Inspirational

4.7  

Kadambari Srinivasarao

Inspirational

నవీన కవిత్వం

నవీన కవిత్వం

1 min
367


అక్షరాల బొడ్డుముడి సరిగా వేయకపోయినా

పదాల పుల్లలు ఒంపు సొంపుగా లేకపోయినా

గూగులమ్మ నుండి ఎరువు తెచ్చుకున్న

వాక్యాల దారం గట్టిగా కట్టేసి

ఎగిరేస్తున్నాయి కవితా పతంగాలు


అద్దం పద్ధం లేని ప్రాసల తోకలు తగిలించుకుని

అవే అందంగా భ్రమించి

ఆకాశానికి అర్రులు జాస్తూ

అంతరీక్షపు అంచుకు చేరాలని

ఎగిరేస్తున్నాయి ఉరకలేస్తున్న ఉత్సాహంతో..


లెక్కకు మిక్కిలి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ

సంఖ్యా బలం పెంచుకుని

మిన్నును చుట్టుముట్టి

కొత్త పుంతలు తొక్కుతున్నాయి

పాత సంస్కృతికి పాతరేస్తూ..


అంతకంతకూ సాహిత్య విపణిలో విహరిస్తూ

నాణ్యంగా తీరు దిద్దుకున్న

కవన పతంగాలను సైతం వెక్కిరిస్తూ

తమ ఉనికిని చాటుకుంటున్నాయి

ఎందుకంటే అవి నవీన తొడుగులు కదా!!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational