Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

t. s.

Classics Others

4  

t. s.

Classics Others

నువ్వు + నేను - ప్రేమ

నువ్వు + నేను - ప్రేమ

1 min
393


ప్రేమా.... నీ పై కావ్యం వ్రాద్దామనుకున్నా...

కానీ....

నీపై... ఏమీ లేని భావన...

ఖాళీ అయిన మనసు నుంచి...

ఏ ప్రేమ కవితలు, ప్రణయ కావ్యాలు రాయలేని, 

రాలేని పరిస్థితి.


ప్రేమంటే... ఔషధం లాంటి అమృతం అన్నారు...

అనంతమైన భావన అన్నాను ఒకప్పుడు నేనే...

అప్పుడు నువ్వు అన్నావుగా...

ప్రేమంటే... అంతులేని ఆనందమని,

అరుదైన అధ్భుతం అని...


మరి...ఇప్పుడు...


కాదేమో...

ప్రేమంటే...

అంతులేని ఆవేదన అంటాను నేను...


ప్రేమంటే...

హృదయాన్ని పిడికిలిలో పట్టుకుని...

మనసు ఊపిరిని బంధించే చెరసాల...


నిజమేనా... 

ప్రేమ అంటే ఇంతేనా...

నీపై... ఏమీ లేని భావన...అని అంటాను.

కానీ... అది అనుకోవడానికి మాత్రమే.

ప్రేమంటే... 

నువ్వు నాతో లేకపోయినా...

నువ్వు నాతోనే ఉన్నావనే భావన...

నిరంతరం నా ఆలోచనలు నీ చుట్టూనే తిరుగుతున్నాయి...

ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉన్నా, నా చూపుల స్పర్శ నీకు తగలట్లేదంటే నువ్వు నన్ను ప్రేమించలేదని అని...అనుకోనా...


ప్రేమంటే...ఇంతేనా...

అంతులేని ఆవేదనా...



Rate this content
Log in