నువ్వు లేవు
నువ్వు లేవు
నువ్వు లేవు నీ నవ్వుంది
ఇంటి ముందు మల్లెతీగల్లొ అల్లుకొని
కమ్మని సన్నని సన్నజాజిలా క్రమ్ముకొని
నా గుండెల్లో చుట్టుకొని
ఆకాశంలో మెరిసే మెరుపుల్లో దాక్కొని
నిజంగా ఉంది.
జాలిగా హాయిగా వికసిస్తూ ఉంది.
శిశిర వసంతాల మధ్య వచ్చే
ప్రకృతిని గుర్తుకు తెస్తోంది
యిన్నేళ్లైనా నీ నవ్వు పుష్కలంగా పరిమళిస్తూనే ఉంది
