Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Others

4  

Gayatri Tokachichu

Others

నువ్వే కొత్త దారి చూపుమా!

నువ్వే కొత్త దారి చూపుమా!

1 min
263



------------------------ 

అప్పుడెప్పుడో పుస్తకాల్లో చదివాము.

సతీ సహగమనమొకటి ఉండేదని 

కలికి బ్రతుకు కాలి బూడిదయ్యేదని,

మొన్న మొన్న విన్నాము

కన్యాశుల్కమొకటి పట్టిందని

కన్నె బ్రతుకు నాశనమని.


నిన్నా నేడు ఇదిగిదిగో

ఇంటింటా చూస్తున్నదే

వరకట్నమన్న పిశాచి వీర విహారము చేస్తున్నది.

యుగ యుగాలు గడుస్తున్నా,

కాలమెంతో పరుగెడుతున్నా,

పేరు మార్చి వస్తూనే వుందేదో దుర్మార్గము.


ఆడ పిల్ల పుట్టడమే అవని కేదో శాపమని,

అధోగతియె ప్రాప్తమని కన్నవారు భావిస్తే కళ్యాణం కలుగుతుందా!

పురుషుడిగా పుట్టడమే పుణ్యకార్యమవుతుందా!


కాలానికి ఎదురీదే 

రాజా మోహన రావులు, గురజాడలు, వీరేశాలు

మళ్ళీ మళ్ళీ వస్తారని మాయలోన బ్రతుక రాదు.


నువ్వే నీ కోసము నిల్చి

రూపు మాపు మశూచిని.

నీచ సాంప్రదాయపు కోటలు నిలువునా కూల్చెయ్యి.

ధైర్యముతో ప్రశ్నిస్తే దయ్యమైనా వదులుతుంది.

నిర్భీతిగ నిలుచుండి అడుగు ముందుకెయ్యాలి.

ఆత్మ న్యూనత విడనాడితే 

విశ్వాసమే విజయాన్ని తెస్తుంది.


నువ్వే నువ్వే ముందుకురికి కొత్త బాట వేయుమా!

నువ్వే శంఖాన్ని పూరిస్తే 

 అడుగులోన అడుగు కలిపి అతివలంతా నడిస్తే 

ఐక్యతతో ఎదిరిస్తే

స్త్రీ పురుషుల మధ్య అసమానత పోయి పోయి 

నవ సమాజమే మనముందు నచ్చినట్లు నిలబడుతుంది.



Rate this content
Log in