నూరేండ్లపంట జీవితం
నూరేండ్లపంట జీవితం


నూరేండ్ల పంట జీవితం
మధ్యలో ముగిస్తే వ్యర్థం
సంపూర్ణ జీవనమే నిండుతనం
తనువును చంపితే అదే పాపం...
క్షణికావేశంలో నిర్ణయం వద్దు
ఒక్క క్షణం వదిలేస్తే
అద్భుత ప్రయాణం సాగుతుంది
అనుకున్నది ఆరో ప్రాణంగా నిలుస్తుంది..
విద్యార్థి నీవే భవితకు దర్పణం
ఫలితం విఫలమైతే ఆవేశం వద్దు
మరో అవకాశం నీ చెంతనే
విజయానికి సోపానాలుగా ఉంటాయి....
ప్రేమ దోమకాటు బలి అయితే
నూరు వసంతాల సంబరాలు ముగిస్తావా
అనుకున్నది దక్కకపోతే ఏడుస్తూ
ఆత్మహత్యకు ఆయుష్షును బలిస్తావా...
లాభనష్టాల
ు జయాపజయాలు సహజం
ఓటమితో కుంగి కృశించి పోతావా
అదృష్టమన్నది నీకు మరో వరం
అల్పాయిషు ఎందుకు కోరుకుంటాం..
కాలాన్ని నిందించక ప్రయాణించు
కాలాన్ని ఎదుర్కొంటు నిలబడు
అద్భుతాలను సాధించుకుంటూ బలపడు
నింగిలో నీవే ప్రయోజన గీతం రాస్తావు..
ఎన్నో జన్మల పుణ్యఫలం మానవజన్మ
సంపూర్ణ జీవితము తోనే అది సఫలం
తనువును హింసించి చంపొద్దు
పూర్ణాయిష్యును అనుభవించు ఆనందించు..
రాగల కాలం సుందర స్వప్నం
అనుభవించే జీవితం మధుర ఫలం
నిష్కారణంగా వదలకు జీవితాన్ని
ఆరోగ్యముతో ఆయుష్షు ఉన్నంతవరకు జీవించు..