Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

నిప్పు వంటిది నిజము

నిప్పు వంటిది నిజము

1 min
259


   

నిజమన్నది నిదుర పోవుట నిక్కమౌనా!

వదలకెప్పుడు ఆత్మ స్థైర్యము నిర్భయముతో కదిలి లేపిన

నిదుర మత్తు వదిలించుకొని వచ్చును నిజము విజయమై నిలిచి పోవు 


పాతి పెట్టిన నిజపు నెప్పుడు

త్రవ్వి తీసిన లేచి నిలబడి

కాహళా ధ్వనుల తోడ

కేక పెట్టుచు గర్జించు నిజమే గర్వముగా నడచి వచ్చును ధరణి లో ధర్మమై.


నివురుయందున కప్పబడిన నిప్పు వంటిది నిజము చూడు!

కాల్చి తీరును కలుషితంతంబుల

కాల మందున కలిసి పోక నిలుచు నెప్పుడు శుభము లిడగ

 


పావనంబగు పరమాత్మ రూపములు 

సత్య ధర్మము లనెడి సుగుణాలు

నీతి నిజాయితీగా మసలు కొన్నను చాలు 

శాశ్వతంబుగ కొలువుచేయును సత్వగుణమై 


బలము, ధనము, మదము, క్రోధముల నెదిరించి నిజము నిలుచు 

మరణ మన్నది లేదు నిజముకు

ప్రణవ నాదము వోలె శక్తిగా

విశ్వ మందున తేజమై వెలుగొందు మంచి వారికి మార్గ దర్శిగ.


సజ్జనుల సాంగత్యమున వర్ధిలు చుండును నిజము నిజముగ

సత్యమును కనుగొని ధీర గుణముతోడ మెలగిన 

వెన్ను దన్నుగ నిల్చు నెప్పుడు నిత్యము సంపదై.

----------------------------



Rate this content
Log in

Similar telugu poem from Inspirational