నీ నవ్వు ఏ రాగమో
నీ నవ్వు ఏ రాగమో
1 min
4
పసి పిల్లల నవ్వులా...
విరిసిన మల్లెలా...
హరివిల్లు హాస్యంలా...
ఉప్పొంగే కెరటంలా...
సిరి మువ్వల ధ్వనిలా...
చినుకుల పలకరింపులా...
పురివిప్పిన మయూరంలా...
హంసల నడకల కులుకులా...
నది పరవళ్ళలా...
పాల పొంగులా...
పైరున తుషార బిందువులా...
మెరిసే మెరుపులా...
మైమరుపులా...
ఎదని పులకింప చేసే ఆ నవ్వుని....
ఏమని వర్ణించనూ...
ఎంతైనా తక్కువే....
వెరసి...
నీ నవ్వు ఆనంద భైరవి రాగమై...
నన్ను మోహన రాగంతో సమ్మోహన పరచి...
కళ్యాణి రాగంతో....
నీతో నన్ను బందీ చేసింది సుమా...!
