శ్రీ శ్రీ

Others

4  

శ్రీ శ్రీ

Others

నేను నిన్ను ప్రేమిస్తున్నాను..

నేను నిన్ను ప్రేమిస్తున్నాను..

1 min
83



అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. !

ఒకప్పుడు ప్రేమ అనే పదం వింటేనే చిరాకుపడే నేను,

ప్రేమించడం నేరం అనుకునే నేను..

ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను....

నాలోని నన్ను ఎప్పుడో, ఎక్కడో వదిలేసి నిన్నే నాలో నింపుకున్నాను.

మరి నా ప్రేమను నీకు ఎలా తెలుపను..

నువ్వు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో కనిపించే వెలుగును అడుగు చెప్తుంది.

నీ పేరు పలికినప్పుడు నా అధరాల ఆనందాన్ని అడుగు చెప్తాయి.

నీ స్పర్శ తగిలినప్పుడు తన్మయత్వం పొందే నా తనువుని అడుగు చెప్తుంది..

నువ్వు నాకు దూరంగా వెళ్తున్నప్పుడు బరువెక్కిన నా మనసును అడుగు చెప్తుంది.

నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో... అని..

దానికి బదులుగా నిన్ను ఏమి అడగను ఒక్క ప్రేమను తప్ప...

నా మీద ప్రేమ లేదు, రాదు అని మాత్రం చెప్పకు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తూ నీ ఊహలలో అయినా బతికేస్తాను కాని,,

నీకు 'నా ' మీద ప్రేమ లేదని, రాదని తెలిస్తే ఈ గుండె ఆగిపోతుందేమో...

అవును నేను నిన్ను నాకన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను...

ప్రేమతో... నీ... నేను... !

శ్రీ.....

హృదయ స్పందన... 


Rate this content
Log in