Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Inspirational

4.6  

Kadambari Srinivasarao

Inspirational

నాలుగు మాటలు

నాలుగు మాటలు

1 min
242


అవి..

కష్టాల సుడుల మధ్య చిక్కుకున్న

జీవన నావను సురక్షిత తీరానికి చేర్చే

మనోధైర్యపు గుళికలు


అవి..

బాధల బందీఖానాలో చిక్కుకున్న

అభాగ్యులను బయట పడేసే

ఓదార్పు లేపన పూతలు


అవి..

నమ్ముకపు త్రాసులో నిలిచిన

జగతిని అభ్యున్నతి వైపు నడిపించే

అఖండ వెలుగు రేఖలు


అవి..

మూఢాచార రుగ్మతతో మూలుగుతున్న

సమాజ నాడిని సరిచేసే

సంస్కార సవ్వడులు


అవి..

పెడదోవ పట్టే గుడ్డెద్దులను

ప్రమాద హెచ్చరికతో సరైన దారిలో నడిపించే

విలువల రత్నాలు


నాలుగు మాటలు చెప్పే

హృదయాలు నీ శ్రేభిలాషులైతే

ఈ ప్రపంచంలో నీవే అదృష్టశాలివి!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational