నాకోసమే...
నాకోసమే...
ఎప్పుడూ లేని ఆనందమేదో
నన్ను వెతుకుతూ వచ్చిందేమో..
జీవిత మలుపులో
నేను వచ్చే రహదారిలో
నా కోసమే ఎదురు చూసే
మంచి గంధం పూవులు
ఆనందం లో ముంచుతుంటే
ముద్ద బంతి పూవులన్నీ
దారంతా పరచుకున్నాయి
మల్లెలన్నీ ఒకే చోట చేరి
ఎదురొచ్చాయి మాల కట్టి...
... సిరి ✍️❤️