Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

నా మది చెప్తుంది

నా మది చెప్తుంది

1 min
374


నేను ప్రయోజకుడిని కాదంటోంది ఈ ప్రపంచం...

కలలను నెరవేర్చుకోలేక, కళలను సాధించలేక

సరైన సంపాదన లేక, సరిగా స్థిరపడ లేక

ప్రతిక్షణం పడిపోతున్నందుకేమో...!

నేను ప్రయోజకుడిని కాదంటోంది ఈ ప్రపంచం...

చెలిమి దూరమై, ప్రేమ కరువై

ఓ సహోదరుడిగా, చివరికి ఓ కొడుకుగా కూడా

అనుక్షణం విఫలమవుతున్నందుకేమో...!

నేను ప్రయోజకుడిని కాదంటోంది ఈ ప్రపంచం...

బరువు చేరువై, బ్రతుకు భారమై

సమస్యలతో నలుగుతూ, కోపంతో అరుస్తూ

నన్ను నేనే కోల్పోతున్నందుకేమో...!

ఇలా ప్రతి దాంట్లో నేనోడిపోతున్నా...!

ఓ చిన్న విజయం కోసం కాంక్షతో ఎదురుచూస్తూ ..!

నా ఏడుపుగొట్టు మొహానికి అనుక్షణం చిరునవ్వుల రంగులద్ది జీవనం సాగించడం లో మాత్రం నే ప్రయోజకుడినే కదా...అని నా మనసు చెప్తుంది.

                                                 - సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in