STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ఘోష

నా ఘోష

1 min
3


నా ఘోష వింటుందా అంబరం

ఔనన్నది దిక్కులో ఐరావతం

తూర్పు దిక్కున పొడిచింది బింబం

పొంగుతున్న వెలుగుల ‌కుంభం..


నిండుకుండ తొలికి చినుకులే కురిసే

తొలకరి మనసు చిగుళ్ళు వేసే

కురిసిన వెలుగు కిరణం మెరిసింది

చీకటి బండ చీలి పోయినది...


ప్రతి వృక్షము నిత్యం ఎదుగుతుంది

పచ్చని శ్వాసలో ఆశను నింపుకొని

ప్రతి పువ్వు నవ్వుతూ పలుకుతుంది

పరిమళాల భాషలతో పాటలు పాడుతూ...


సాగుతున్నది మిత్రత్వపు విందు

తీగలను సవరిస్తూ మెలికలు తిరుగుతూ

లేత చిగుర్ల పచ్చళ్ళు ఆరగిస్తూ

సుత్తి మెత్తని గాలి మనసును తాకుతుంది..


నరాల్లో మెరుపుల జిలుగులు

గారడీ విద్యలు ప్రదర్శిస్తున్నాయి

తాకిన కొత్త యవ్వనం రాగాలాపన చేస్తూ

తియ్యటి గర్వముతో పాడుతుంది..


రక్తపు రంగులో చిత్రవాంఛ ఉంది

ఎదుటి సొగసు తాగేస్తుంది

చీకటి కళ్ళకు వర్ణము అంటించి చూపించే

వెన్నెల గిన్నెలో హృదయం ఉంచి...


ప్రతి హృదయంలో రసధ్వని ఊరుతుంది 

రెప్ప పాటు కాలాన్ని మైమరిపిస్తూ

పారవశ్యముతో జగత్తును కదిలిస్తూ

ప్రకృతి రూపాన్ని మరో పార్శ్యంలో చూపిస్తుంది..




Rate this content
Log in

Similar telugu poem from Romance